YSRCP NRI WING MEET IN DALLAS
మే ౭ తేదిన డల్లాస్ లోని మయూరి రెస్టారెంట్లో వైఎస్అర్ కాంగ్రెస్ ఎన్నారై డల్లాస్ భాగం ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధి రోజా సెల్వమణి ముఖ్య అతిదిగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఎన్నారై విభాగం లక్ష్యాలను, కార్య చరణ, రాబోయే ఎన్నికలలో ప్రవాసంద్రుల ప్రచారం గురించి మల్లు ప్రసాద్ రెడ్డి,మహేష్ అద్దిబోట్ల సభికులకు వివరించారు. నెల్లూరుకు చెందిన వై ఎస్ ఆర్ పార్టీ జిల్లా నాయకులు, ప్రవాసంద్ర సంఘం నాయకులు గోపిరెడ్డి చిల్లకూరును కలువల రావు సభకు పరిచయం చేసారు.
ఈ సమావేశంలో చిల్లకూరు గోపిరెడ్డి మాట్లాడుతూ... రానున్న ఉప ఎన్నికలు ఫలితాలు రాష్ట్రంలోఎన్నో మార్పులకు వేదిక కానున్నాదని, అన్నిస్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. కోవూరు ఉప ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు.
వైఎస్ఆర్ పార్టీ సెంట్రల్ కమిటీ నాయకురాలు రోజా సెల్వమణి మాట్లాడుతూ.. జనం బాగు కోసం తపిస్తున్న జననేత జగనన్నతో కలిసి పనిచేయడం తన అదృష్టం అన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని, జగనన్న ముఖ్యమంత్రి కానున్నారని, త్వరలోనే రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం రానుందని తెలిపారు. ఇద్దరు అసమర్ద నాయకుల చేతిలో మన రాష్ట్రం అల్లకల్లోలమైందని అన్నారు. సోనియాగాంధీ, కేంద్ర మంత్రి చిదంబరం వల్ల రాష్ట్రం భ్రష్టుపట్టిందని రోజా అన్నారు.
వైఎస్ఆర్ ఎందరో చెల్లెలను రాజకీయంగా పైకి తీసుకొని వస్తే, అధికార దాహంతో వారు సోనియాకు దాసోహం అయ్యారన్నారు. మంత్రి పదవిని వదులుకొని, ఎం ఎల్ ఏ పదవికి కూడా రాజీనామా చేసినా కొండా సురేఖ లాంటి నిజమైన చెల్లెమ్మలు జగనన్నకు అండగా నిలిచారని అన్నారు. అమెరికాలోని ప్రావాసాంధ్రులు కూడా రాజశేఖరుని కుమారుడుపై చూపిస్తున్న ఆదరణ, ఆప్యాయతలను జగనన్నకు తెలియచేస్తానని అన్నారు.
చివరగా ప్రవాసాంద్రులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. ఆటా డల్లాస్ కన్వీనర్ అరవింద్ రెడ్డి, టెక్సాస్ తెలుగు సంఘం మాజీ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీలు ఎన్ఎంఎస్ రెడ్డి, ఉర్మింది నరసింహ రెడ్డి లు రోజాను శాలువాతో సన్మానిచారు .ఈ కార్యక్రమంలోడల్లాస్ ప్రముఖులు మల్లు ప్రసాద్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, తిరుమల రెడ్డి, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, అశోక్, అయులురి బస్విరెడ్డి, అప్పిరెడ్డిలు పాల్గొన్నారు. కిస్తాపాటి రామన్ రెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
YSR CP NRI wing Donates 2.5lac for DESIRE Society
భారీ మెజార్టీతో గెలిపించండి: ఎన్నారైలు విజ్ఞప్తి
త్వరలో రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ లభించేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని వాషింగ్టన్ డీసీ ఎన్నారైలు ఆంధ్రపదే శ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రతి పేదవాడికి ఉపయోగపడేలా రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ గృహాలు,.... వంటి తొమ్మిది పథకాలను రూపొందించి అమలు పరిచిన మహా మనిషి దివంగత రాజశేఖర రెడ్డిపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం చేస్తున్న క్షద్ర రాజకీయాలకు ముగింపు పలకాలని వారు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం ప్రొద్భలంతో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్. కిర ణ్ కుమార్ రెడ్డి మహానేత ప్రవేశ పెట్టిన ఒకోక్క పథకాన్ని కొండెక్కిస్తున్నారని అన్నారు.ఈ ఎన్నికలు చిన్న సైజ్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని వారు తెలపారు. కడప పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో జగన్ అత్యధిక మెజార్టీతో ఎన్నికై రికార్డు సృష్టించారని, అదే విధంగా ఈ ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ మేజార్టీ వచ్చేలా ప్రజలు ఓట్ల వర్షం కురిపించాలని వారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తనయుడు వైఎస్ జగన్‌లు తమకు ఎదురైన ఎన్నో అటాంకాలను అంకితభావం, ధైర్యం, తెలివితేటలు, బుద్దిబలంతో అధిగమించారని వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గడపలో మహానేత ఫోటోని ఉందని, ప్రజలు ఆయనని ఎంతగా అభిమానిస్తున్నారో దీని ద్వారా తేటతెల్లం అవుతుందని చెప్పారు. మహానేత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన తుది శ్వాస విడిచే వరకు ప్రజలకు అందించేందుకు కృషి చేశారని ఎన్నారైలు తెలిపారు.
19 అసెంబ్లీ, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాలకు జూన్12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలోని ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
YSR CP Pravaasaandhrula Prasthanam in Kuwait
Janam Kosam Jagan Documentary Released
డెట్రాయిట్‌లో వైఎస్‌ఆర్ పార్టీ వార్షిక సంబరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తలపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకువెళ్ల్లేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ మద్దతుదారులు ఆదివారం పునరుద్ఘాటించారు. వైఎస్‌ఆర్ పార్టీ మొదటి వార్షికోత్సవ సంబరాలు ఆదివారం డెట్రాయిట్ నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ మద్దతుదారులు పార్టీ జెండా ఎగురవేసి, కేక్ కట్ చేశారు.
తమ ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్‌ఆర్ అందించిన సువర్ణ పాలనను వారు గుర్తు చేసుకున్నారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారికి బాసటగా నిలుస్తున్న తమ పార్టీ అధినేత జగన్‌కు ఎప్పటిలాగే ప్రజామద్దతు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ పాలన పగ్గాలు చేపట్టి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. డెట్రాయిట్ నగరంలో పార్టీ తరపున సమీప భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై వారు ఈ సందర్భంగా చర్చించారు. కోవూరు అసెంబ్లీ స్థానంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డికి ఓటువేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ఆ నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో లింగాల హరిప్రసాద్ రెడ్డి, సునీల్ మండుటి, వెంకట్ బీరం, వినోద్ కుకునూర్, యుగంధర్ భుమిరెడ్డి, పురశోథం కూకటి, కొనుగంటి రమణ రెడ్డి, వినోద్ ఆత్మకూరు, రవికిరణ్, విద్యాధర్ రెడ్డి బుజాల, టి. శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ చిత్తలూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డెట్రాయిట్‌లో ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు
మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 62వ జయంతి వేడుకల్ని అమెరికాలోని డెట్రాయిట్‌లో ఆదివారం జూలై 10 తేదిన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఎన్నారై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక తెలుగు కమ్యూనిటీ నాయకులు హాజరై, కేక్ కట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజల అభ్యున్నతికి, ఇతర బలహీన వర్గాలకు, మైనారిటీలు, మహిళలకు, రైతుల సంక్షేమానికి డాక్టర్ వైఎస్‌ఆర్ ఎనలేని కృషి చేశారని.. ఆయన పాలన స్వర్ణయుగాన్ని తలపించిందని పలువురు వ్యాఖ్యానించారు.
సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది మంది ప్రజల గుండెల్లో వైఎస్‌ఆర్ గూడుకట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వైఎస్‌ఆర్ మరణం ఆంధ్రప్రదేశ్‌కు తీరని లోటు అని పలువురు అన్నారు. ఈతరం వారికి, భవిష్యత్ తరం వారికి నాయకత్వ విలువల్ని, గొప్ప తనాన్ని చాటి చెప్పారన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తప్ప వైఎస్‌ఆర్ ఆశయాలు ఫలిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ‘హ్యాపీ బర్త్‌డే వైఎస్‌ఆర్’, ‘వైఎస్‌ఆర్ అమర్ రహే’, ‘జోహార్ వైఎస్‌ఆర్’, ‘వి మిస్ యూ వైఎస్‌ఆర్’ అనే నినాదాలు మిన్నంటాయి.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లింగాల హరిప్రసాద్‌రెడ్డి, బీరం వెంకట్‌రెడ్డి, యుగంధర్, చిట్టలూరి శ్రీనివాస్, ఆత్మకూరు వినోద్, కుకునూర్ వినోద్, యాదం బాలజీ, గాలి నాగేందర్, మందుటి సునిల్, యార్లగడ్డ శ్రీరామ్, మారంరెడ్డి సాగర్, కూకటి పురుషోత్తం, సాంబిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
Dr. YSR Birthday Cerlebrations In Singapore
త్వరలో అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో "వైయస్‌ఆర్ సీపీ" కార్యాలయాలు
అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో త్వరలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారైలు వెల్లడించారు. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని సిన్సినాటీలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్నారైలు ప్రసంగించారు. ఇప్పటికి 12 రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వీటన్నిటిని అనుసంధానం చేస్తూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశే ఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీవే కాని కాంగ్రెస్ పార్టీవి కాదని ఎన్నారైలు పేర్కొన్నారు. ఈ పథకాలు రాష్ట్రంలో అధికారంలోఉన్న కాంగ్రెస్ పార్టీ చెందినవిగా చెప్పుకుంటుదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాలే అయితే దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావటం లేదని వారు ప్రశ్నించారు. మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అమలు కావాలంటే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైయస్ జగన్మోహాన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వారు ఆకాంక్షించారు.
UAE NRI YSR CONGRESS MEET IN SUPPORTING YSJAGAN`s MAHADHARNA