fvz

Sunday, June 27, 2010

Monday, June 21, 2010

Monday, June 07, 2010

Wednesday, June 02, 2010

అవసరమైతే "ఓదార్పుపాదయాత్ర 2010"...

మకుటంలేని మహారాజుగా, ఓటమికి అర్థం తెలియని దీరుడిగా, ప్రతిపక్షంలో ఉండి రాజకీయ ఎత్తుల్ని ఒంటి చేత్తో అవపోసాన పట్టి, ప్రజలు ఎంకోరుకుంటున్నారో వాళ్ళకి ఎంకావాలో స్పష్టంగా అర్థంచేసుకొని, భగ భగ మండే సూర్యుడిని సైతం లెక్కచేయకుండా రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కులోని ప్రజల సుభీక్షం కోరుకోని "పాదయాత్రలు" చేసి "సింహాసనం" అధిష్టించిన ఏకైక మగమహారాజు, ధీరుడు, వీరుడు, అసామాన్యుడు, రాజకీయ ఉత్తమ దర్శకుడు, కనుసైగలతో ఆంధ్రదేశాన్ని శాసించిన ఒకే ఒక్కడు, తెలుగు మగధీరుడు, రాజనీతిజ్ఞుడు, చరిత్ర చూడలేని, చరిత్ర మరువలేని తెలుగుతల్లి పులిబిడ్డ మన ప్రియతమ దివంగత నేత " డా. వై ఎస్ రాజశేఖరరెడ్డి గారు ". ఆలాంటి మహానేతకి కొడుకుగా పుట్టడం మీ పూర్వజన్మ సుకృతం .... జగన్ అన్న గారు మీకు వీరాభిమాని గా ఈ చిన్న విన్నపం... ఓదార్పుయాత్ర పూర్తిగా మీ "వ్యక్తిగతయాత్ర" ఈ విషయం మీరు గొంతు అలసిపోయేలా మీడియా ద్వారా చెప్తున్నా, కొన్ని వీధికుక్కలు, రాజకీయ రంగు పూసి, ఓరుగల్లులో మీ అడుగులను వెనక్కివేయించటం మమ్మల్ని(అభిమానులను) చాలా బాధ కి గురిచేసిన విషయం.ఇది క్శుద్ర రాజకీయం. రాహుల్ గాంధీ గారు ఎవరిని అయినా పేద వాళ్ళని కలవాలి అనుకుంటే, చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే వెళ్లి వాళ్ళని కలిసి, వాళ్ళు పెట్టింది తిని, వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకొని వస్తుంటారు. ఇది అంతా అయన వ్యక్తిగతం. ఇలాగే మీరు ఒక సామాన్యమైన శక్తీగా, లేక ఒక చుట్టపు పలకరింపుగా ప్రజల వద్దకు వెళ్తే తప్పేంటి?? మీరు ఫలానా రోజున ఫలానా జిల్లాకు వెళ్తున్నానని బాహాటంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని మా అభిప్రాయం...నాన్నగారు, మీరు, మీ కుటుంభం మొత్తానికి మా గుండెల్లో గుడికట్టి పూజిస్తున్నాము, ఆరాదిస్తుఉంటాము. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకి వెళ్ళాలన్న, ఏ సెంటర్ కి రావాలన్న, ఏ గడప తోక్కలన్నా ఆ హక్కులు మీకు పూర్తిగా ఉన్నాయి. ఒక రాహుల్ గాంధీ గారి లాగా మీరు ఫలానా టైం లో, ఫలానా ఫ్యామిలీని ఓదార్చటానికి వెళ్తున్నాను అని బాహాటంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం మీకు లేదు, ఎందుకంటే ఇది పూర్తిగా మీ వ్యక్తిగతం. మీ మనసుకు నచ్చిన పని కోసం, ప్రజలు కోరుకుంటున్న పని కోసం అవసరమైతే మీరు మరో "ఓదార్పుపాదయాత్ర 2010" ని చేయండి. అనుకున్నది సాధించండి. మాటతప్పని మడమతిప్పని నైజం మన సొంతం. ఇది చరితం. కానీ రోడ్ల మీద పడి మొరిగే ఊరకుక్కల్ని మీరుపట్టిన్చుకోవటం అనవసరం జగన్ అన్నా!!!! ఇట్లు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీతోనే ఉండే మీ అభిమాని

ఓదార్పు..

మిమ్మల్నే స్మరిస్తూ ...

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top