Monday, January 03, 2011
YS JAGAN DELHI DEEKSHA ON 11th JAN 2011
ఆవును. . "రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడాతం" ఈ మాట జగన్ అన్న విజయవాడ లక్ష్య దీక్ష లో కుండలు బద్దలు కొట్టి చెప్పాడు. మాట ఇచ్హారు కాబట్టి ఒక రైతు బిడ్డ గా రైతులకి న్యాయం కోసం ఏకంగా ఢిల్లీ లో దీక్ష. . .ఎవరు నిజం గా ప్రజలకి, రైతులకి న్యాయం చేస్తారో ఈ ఒక్క విషయం చాలదా. .! జగన్ అన్న లక్ష్య దీక్ష గురించి ప్రకటించిన రెండు గంటలలో "మన ఎల్లో బాబు గారు నేను సైతం అంటూ" ఓ యువనాయకుడిని కాపీ కొట్టి చేసిన దొంగ దీక్ష గురించి రైతులు ఎలా మర్చిపోతారు?
ప్రజలు ఇప్పటికైనా దొంగ బాబు దీక్షల గురించి నిజాలు తెలుసుకొని, కేవలం కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవటానికే, రాజన్న ఇచ్హిన ఉచిత కరెంటు ఉపయోగపడుతుంది అన్న ఎల్లో బాబు మాటలు రైతులు మర్చిపోకుండా . . .ఈ బాబు కేవలం రచ్చలు (తగాదాలు) పెట్టటానికి మాత్రమే పనికివస్తాడు అని రైతులు గ్రహిస్తే మంచిది.
మన రాజన్న రైతుల కోసం ఎంత గా పరితపించారో, మన ఆంధ్రదేశంలో ప్రతి గుండె రైతుల్లో, ఆ గుర్తులు ఇంకా పదిలంగా ఉన్నాయి. . .రాజన్న బిడ్డగా మీరు(జగన్ గారు) రైతుల కోసం ఢిల్లీలో దీక్ష ద్వారా గర్జించటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. . .అదే తెగువ. . .అదే మొండితనం . .అదే బాటగా . . . మీరు (జగన్ గారు) ప్రతి రోజు మీరు మాకు (ప్రజలకి) చాలా దగ్గర అవుతున్నారు. . .మీ(జగన్)లాంటి నాయకుడు ఒక్కరు ఈ దేశానికి తప్పనిసరి అవసరం . . .
ఇట్లు
ఓ రైతు బిడ్డ
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comment :
Post a Comment