కడప జిల్లాలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుటంబం పట్టు ఏమాత్రం తగ్గలేదని మరో సారి రుజువు అయింది. మంత్రులు ఎంత విశ్వయత్నం చేసినా జగన్ వర్గాన్ని ఓడించలేకపోయింది.యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా జిల్లాలో కట్టడి చేసేందుకు కాంగ్రెస్- టీడీపీలు చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ అట్టర్ ప్లాప్ అయ్యింది. జగన్ వర్గం పక్షాన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు నారాయణరెడ్డి పోటీచేయగా, కాంగ్రెస్ పక్షాన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యేవరదరాజులు రెడ్డి పోటీచేశారు. ఈ జిల్లా లో జరిగిన పోటీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించారు. జగన్ వర్గాన్ని ఎలాగైనా ఓడించాలని, ఆరోగ్య శాఖ మంత్రి డి.ఎల్.రవీంద్ర రెడ్డి, జగన్ సొంత బాబాయి, రాష్ట్ర వ్యవసాయ మంత్రి వివేకానందరెడ్డి, మరో మంత్రి అహ్మదుల్లా, ఇన్ ఛార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర యత్నం చేసినప్పటికీ జగన్ వర్గాన్ని ఓడించలేకపోయారు.
మొత్తం మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులకు ఇది అప్రతిష్ట తెచ్చిందని చెప్పవచ్చు. దీంతో పాలకపక్షం, ప్రతిపక్షాలు వేసిన కుయుక్తులు చిత్తు అయ్యాయి.
1 Comment :
yes this is true
Post a Comment