Wednesday, June 22, 2011
సత్తి ఓ మంచి పనోడు. . !
ప్రజలకు పనికి వచ్చేది ఒక్కటి లేకున్నా
తన కుటుంబానికి మాత్రం లోటు లేకుండా చేసుకొని
తన ప్రాంతానికి వోక్స్ వాగన్ అంటూ వచ్చిన
హోక్స్ కంపెనీకి ఓ పది కోట్లు తగలెట్టి
డబ్బులు పోనాదని అమాయకంగా సెలవిచ్చి
మా ప్రాంతం కూడా వెనకబడి పోయిందని వాపోయి
పార్టీ బాసుగా క్రమశిక్షణ దాటితే సహించ అని
దాటిన వాళ్ళను కలుస్తూ కలుపుకొంటూ
సమాంతర సమీక్షలు చేస్తూ
ఇందుగలడు అందు లేదన్నట్టు
అన్నిట్లో తల దూర్చుతూ
పార్టీ కి ఉన్న సాంప్రదాయ సామాజిక వర్గం
కొత్త పార్టీతో కోల్పోతే
తామ సామాజిక వర్గం ఉంటుందనే భరోసా కల్పనలో భాగంగా
తన సామాజిక వర్గం లో ని వాళ్ళను వాడుతూ
పడరాని పాట్లు పడుతూ
పదవి మీద కాంక్ష ఉందని ఉద్ఘాటిస్తూ
మంచి పనోడు అని మీడియా ద్వారా
మితిమీరిన బడాయి పోతున్నాడు.
Subscribe to:
Post Comments
(
Atom
)
1 Comment :
good one
Post a Comment