Wednesday, June 29, 2011
కాంగ్రెస్ వడ్డనల్లోకి కొత్త కొత్త ఐటాలు. . .
కితాబిచ్చేవాడు ఒకడు లేకున్నా
మార్చేది లేదని
కన్ఫారం చేస్తున్నామని
జాదూ చెప్పింది అవసరం
ఏడుకొండలోడికి ఎంట్రుకలు ఇచ్చేసి
హుషారుగా ఉన్నాడో లేదో
సత్తి మంచి పనోడు అని ఒకడిని
డిప్యూటిని ఒకడిని
బల్లేలుగా పంపించింది కేంద్రం.
సభాపతి చదువు తప్పితే
అమాత్య పదవిని కూడా చదవని
నాకు నీవే దిక్కని
సలహాల రావు అలియాస్ రాజా అర్దాత్మను
ఆశ్రయించాడు కేప్టన్.
సలహాల రావు పని మొదలెడితే
ఆంద్ర రాష్ట్రాన్నే ఆహారంగా చేసి
అమాత్యుల నుండి అధినేత్రి వరకు
బంతిలో కూర్చో పెట్టి వడ్డించేస్తాడు.
వేర్పాటు వెంగల్రావులు అరుపులు
ప్రతిపక్షమోల్ల అరుపులు భాజాలుగా
వింటూ ఆనందంతో ఆరగించేస్తారు.
అసలే ఐ టీ భూమ్తో భూముల భూం మొదలయ్యిందంట
ఖర్చుకు వెనుకాడడానికి అదేమన్న వాళ్ళ అబ్బ సొత్తులా
వడ్డనల్లోకి కొత్త కొత్త ఐటాలు చేయిస్తున్నారు
మెట్రో అంటున్నారు
మలిధపా యజ్ఞాలు అంటున్నారు
లక్షల్లో ఉద్యోగాలు అంటున్నారు
ఈ సారి మెట్రో తో మహాద్భుతంగా మొదలెట్టబోతున్నారు.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comment :
Post a Comment