fvz

Monday, June 06, 2011

JP and CPI Narayana blamed Babu for his doubleTalk

కాంగ్రెస్‌, టీడీపీలు మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకుంటున్నాయని.. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టేందుకు ఆయా పార్టీలు తంటాలు పడుతుంటే.. వారికి తోడుగా లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం.. ప్రత్యేకించి తెలుగుదేశానికి ఇబ్బందిగా మారుతుంది. స్పీకర్‌ ఎన్నిక విషయంలో తనతో ఫోన్‌లో మాట్లాడారని.. స్పీకర్‌ ఎన్నిక రాజకీయం చేయడం మంచిది కాదని.. ఏకగ్రీవమైతే మంచిదని తాను చంద్రబాబుకు సూచించానని జేపీ చెప్పారు. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వ తప్పిదాలను బయటపెట్టే అవకాశం ఉన్నందున.. టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే కలిసివస్తామని చంద్రబాబుకు స్పష్టం చేశానని చెప్పారు. సభ జరుగుతున్న సమయంలో కూడా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనీయాలని ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకున్ని తాను కోరానన్నారు. అయినప్పటికినీ.. దాని గురించి ఎవరూ ప్రస్తావించలేదని, సభలో అధికార కాంగ్రెస్, టీడీపీలు లాలూచీ పడ్డట్లు అనిపించిందని జేపీ అన్నారు. సభ నిరవధిక వాయిదా పడ్డానికి ముందు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అవిశ్వాసం గురించి ప్రస్తావించి చర్చకు పట్టుబడుతుందని ఆశించానని.. కానీ వారు ఆ ప్రస్తావనే తేలేదని.. అందువల్ల ఇదేదో లాలూచీగానే కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సభలో తనకు అవకాశం ఇచ్చినప్పుడు చంద్రబాబు అవిశ్వాసం గురించి ప్రస్తావించకపోవడం.. ఆ తర్వాత గవర్నర్‌ దగ్గరికి వెళ్లి హడావుడి చేసినా విమర్శలు తప్పడం లేదు. చివరికి కాస్త నిజాయితీగా మాట్లాడే జయప్రకాశ్‌నారాయణ కూడా టీడీపీ సరిగ్గా వ్యవహరించలేదని అనడంతో.. ఆ పార్టీకి మరింత నష్టం జరిగే పరిస్థితి వచ్చింది

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top