fvz

Tuesday, July 05, 2011

చెప్పండనే చచ్చులు నాటక పాత్రదారుల్లో ఒక్కడూ కరువే

వంట వార్పులు చేసి
తిని తీరిగ్గా
నాటకానికి బయలుదేరారు.
పాత్ర ధారులు
తెర తీయక ముందే
ఎవరెవరు ఏస్థాయిలో పాడి
రక్తి కట్టించాలో ఒకరికొకరు
(కే సీ ఆర్ కే కే జానా
హరీష్ బొత్సా )
సంప్రదింపులు జరుపుకొన్నారు.

రాజీనామాల పాటతో తెర తీసారు
ఆజాద్ చిదంబరాలు
తమకిచ్చిన పల్లవులను
పాడి వినిపించారు.

ఆ పల్లవులు సరిగా లేవని
ఓ ప్రక్క తిలకిస్తున్న వాళ్ళు
అభ్యంతరం వ్యక్తం చేసారు.

మరో ప్రక్క అభ్యంతరం వ్యక్తం చేసిన
వర్గాలే విరామంలో కలిసి
ఇంకా బాగా పాడాలి అని
వేడుకొంటున్నారు.

నాటకం చప్పగా ఉందని
బంద్ అంటూ
బఫూన్ వచ్చి చెప్పినప్పుడు
ఓ ప్రక్క ఈలలు వినిపించాయి.

నాటకం పై ప్రేక్షలను లీనం చెయ్యడానికి
మరో సారి వంటా వార్పులను చేసి
లేవకుండా వారించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇంకో ఇద్దరు ఒక్కొక్కరుగా వచ్చి పాడేసి
అందరూ కలసి మరో సారి పాడేస్తే
నాటకానికి తెరదించేస్తామని
కీలక పాత్రధారి చిదంబరం
కొత్త పల్లవితో ఆకట్టుకొన్నాడు.

ఈ పల్లవితో
మరో ప్రక్కనుండి
ఆ పాడాల్సిన ఇద్దరిలో చంద్రబాబు వచ్చి
పాడేస్తే పనైపోతుందని గోల మొదలయ్యింది.

గతంలో ప్రణభ్ దగ్గర పాడేసాడు
ఇప్పుడు మరో సారి
ఎందుకని మరో ప్రక్క గొణుగుల్లు.

ఇప్పుడు ఇలా చెప్పిన చిదంబరం
అప్పుడు ఇద్దరేసి దగ్గర ఎందుకు పాడించాడో
ప్రశ్నించే వాడే లేదు.

ఆ ఇద్దరిలో ఒకరైన
తమ నాయకిచేత ఎప్పుడు పాడిస్తాడో
చెప్పండనే చచ్చులు
నాటక పాత్రదారుల్లో ఒక్కడూ కరువే.

అడిగి అడ్డగిస్తే నాటకం అయిపోదూ. .

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top