Monday, February 13, 2012
నీల :
ప్రజలతో మమేకమై వారితో తన అంతరంగాన్ని ఆవిష్కరించుకుంటూ, అక్కున చేర్చుకుంటూ, అలసి సొలసి కష్టాల పాలయిన ప్రజల సేద తీర్చుతూ ఓదార్పు యాత్రను చేస్తున్న
జగన్ చేస్తున్న ఈ మరో ప్రజా ప్రస్థానాన్ని వేనోళ్ళ పొగడుతూ, ఇంత చిన్న వయసులోనే అంత నిబ్బరాన్ని, తండ్రి లక్షణాలని పుణికి పుచ్చుకుని మొక్కవోని ధైర్యముతో
ముందుకు సాగడం చూస్తువుంటే “నిండు కుండ తొణకదు” అనే సామెత గుర్తుకు వస్తుంది. ఆ ఆత్మాభిమానమే, ఆ ఆత్మవిశ్వాసమే ఈ రోజు జగన్ మీద పడిన
నీలాపనిందలకు తాత్కాలిక కారణమైనది. వినాయక చవితి నాడు చంద్రుని చూసినందుకు కృష్ణుడికే తప్పలేదు నీలాపనిందలు. పచ్చ పత్రికలు సాక్షి మీద కక్ష తో విషపు
రాతలతో గొంతులు నొక్కాలని, ఇంతింతై వటుడిఇంతై అన్నట్టు ఎదిగిన మహా వృక్షాన్ని కుల్చినట్టు కలల సోపానాలు నిర్మించుకుంటున్న, అపద్దపు నీటి బుగ్గలని సృష్టిస్తూ
తమ క్రీనీడా కేళీ కొనసాగిస్తున్నారు. నా దారికి రాకపోతే నీ దారి గోదారే అన్న కాంగ్రెస్ పార్టీ తీరు గర్హనీయం, ఖండనీయం. జీవచ్చవం లా పడివున్న పార్టీ కి ఉపిరులు ఊది
ప్రజా ప్రస్థానంతో ప్రజలలో నమ్మకాన్ని కలిగించి, కొండంత ధైర్యాన్ని ఇచ్చి అధికారం రాగానే అన్న మాటకు కట్టుబడి వినూత్న పథకాలతో ఆదర్శప్రాయుడైన రాజసేఖరుడా అవినీతి పరుడు?
చనిపోయిన తరువాత రెండేళ్లకు అతని జ్ఞాపకాలను ప్రజల హృదయలలోంచి తొలగించడానికి ఈ మైలపడిన మనుషులు చేస్తున్నదాష్టికమే ప్రస్తుత స్థితికి కారణము.
నవ స్వర్ణయుగ నిర్మాణ సారథి ని ప్రజలు అంత తొందరగా మర్చిపోరు .. జగన్ తో వారసత్వానికి పోటి పడి గొట్టాల ముందు గొంతు చించుకున్న నాయకుల నోళ్ళు
ఇప్పుడు CBI అంతేసి అభాండాలు వేస్తుంటే పెగలదేమి? ప్రాణ స్నేహితులు, ఆత్మలు ఏమైనట్టు? బట్ట కాల్చి ముఖాన వేసి మలినాన్ని రాజశేఖరుని కుటుంబం మీద
రాబందులన్ని ఏకమై వికృతపు దాడులు చేస్తూ వుంటే ఏమైంది మీ నక్క విదేయత? ప్రజలు అమాయకులు అనుకోని తాత్కాలిక రాజభోగాలకు వెంపర్లాడుతున్న వెర్రి మంత్రివర్యుల
ఆట కట్టే సమయం ఎంతో దూరం లో లేదు. ఢిల్లీ నుంచి గల్లి దాక ఈ వ్యతిరేక శక్తులు ప్రజాగ్రహం లో ఆహుతి అయ్యే రోజే మనకు అసలైన వినాయక చవితి మరియు రంజాన్.
మీద పడిన నీలపనిందలను తొలగించుకొని జగన్ పూర్ణ చంద్రుడి వలె విజయాన్ని వరిస్తాడు. అపద్దపు నీటి బుడగల పద్మవ్యుహాన్ని చేదిన్చుకుంటాడు. మొక్కవోని ధైర్యంతో
మనదరమూ ముందుకు సాగుదాం, అన్యాయాన్ని తల ఎత్తుకొని ఎదిరిద్దాం. రండి కదలి రండి, సమర శంఖారావాన్నిపూరించండి..
Subscribe to:
Post Comments
(
Atom
)
2 Comment :
You are right sir every body know in Andhrapradesh even school boys also know the cbi is only for harassing to YS Jagan.
No one are clean cheated here every political leader like that why CBI did not start enquiry asap in CBN Case like jagan case. every one know sir people waiting to give their judgment.
Hi I am a fan of Jayaprakash narayana but now i like jagan because he is fighting with govt for poor people
-Harshavardhan BTech(IIT),MBA(IIM Ahmedabad)
Post a Comment