Wednesday, March 07, 2012
‘జగన్‌ను అణిచివేసేందుకు కుట్ర జరుగుతోంది’
అట్లాంటా: రాజ్యాంగ నియమాల్ని, నిబంధనల్ని ఉల్లంఘించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా అణిచివేసేందుకు కుట్ర జరుగుతోందని ఎన్నారై గురువారెడ్డి అభిప్రాయపడ్డారు. కుట్రలో భాగంగానే యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహాన్, స్పీకర్ నాదెండ్ల మనోహర్ , ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులు ఓ పథకాన్ని రచిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్ని ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (సీఈసీ) ఎస్‌వై ఖురేషిని గురువారెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం సీఈసీకి బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విలువల్ని పునరుద్దరించేందుకు అవసరమైన చర్యలు తీసుకొవాలని లేఖలో కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ 17 మంది వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి, తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comment :
Post a Comment