Thursday, May 17, 2012
Dallas NRI's Condemned
సాక్షి మీడియా బ్యాంకు ఖాతాలను సీబీఐ స్తంభింపజేయడాన్ని నిరసిస్తూ డల్హాస్‌లోని అవర్‌ప్లేస్ రెస్టారెంట్‌లో ప్రవాసాంధ్రులు సమావేశం నిర్వహించినట్లు స్థానిక ఎన్‌ఆర్‌ఐ చిల్లకూరు గోపిరెడ్డి మంగళవారం ఈమెయిల్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు ఆదిబట్ల మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. చిల్లకూరు గోపిరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షం, అధికార పక్షాలు కుయుక్తులు పన్ని కేంద్రప్రభుత్వ అండదండలతో సీబీఐని అడ్డం పెట్టుకొని జగన్‌మోహన్‌రెడ్డిని, ఆయన సాక్షి సంస్థలను దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు. దీన్ని ప్రవాసాంధ్రులు అనేకమంది తీవ్రంగా ఖండించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అక్కడి ఎన్నారైలు కీర్తిపాటి రమణారెడ్డి, రేడియోకుషి అధినేత తిరుమల రెడ్డి, మల్లు ప్రసాద్‌రెడ్డి, డల్హాస్ ప్రముఖులు ఎన్‌ఎంఎస్‌రెడ్డి, నరేంద్రరావు, ప్రతాప్‌రెడ్డి, వెంపటి సత్యం, మధురెడ్డి, అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comment :
Post a Comment