సాక్షి దినపత్రిక, టీవీ చానెళ్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం,సీబీఐ చేస్తున్న అప్రజాస్వామిక చర్యలను స్థానిక ఎన్నారైలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరులు తీవ్రంగా ఖండించారు. సాక్షి ఖాతాలు స్తంభింపజేయడంతోపాటు ప్రభుత్వ ప్రకటనలు కూడా నిలిపివేసిన నేపథ్యంలో వారు శుక్రవారం సమావేశమయ్యారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము లేక.. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సీబీఐకి మార్గ నిర్దేశనం చేస్తూ 'సాక్షి' గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
సీబీఐ కుట్ర వెనుక సోనియాగాంధీ, రామోజీరావు, చంద్రబాబు, అంబానీ సోదరులు ఉన్నారని ఆరోపించారు. ఈ అన్యాయంపై దృష్టి సారించాలని, విలువలు కాపాడాలని కోరుతూ భారత ప్రధానికి, రాష్ట్రపతికి, సుప్రీం కోర్టు జడ్జికి వినతి పత్రాలు పంపించామన్నారు. change.org వెబ్ సైట్ లో పొందుపరిచిన సాక్షి పిటిషన్.. http://www.change.org/petetions/supportsakshi పై సైన్ చేసి ముక్తకంఠంతో ఈ అన్యాయాన్ని ఆపేందుకు కృషి చేయాలని ఎన్నారైలకు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో లింగాల హరిప్రసాద్ రెడ్డి, డాక్టర్ రామచంద్రారెడ్డి, ఆత్మకూరు వినోద్, వెంకట్ బీరం, సునీల్ మండుటి, పిడపర్తి శ్రీనివాస్ రెడ్డి, టి.శ్రీధర్ రెడ్డి, భూమిరెడ్డి, యుగంధర్, యార్లగడ్డ శివరాం, కుకునూర్ వినోద్, చిత్తలూరి శ్రీనివాస్, పురషోతం కూకటి, రవికిరణ్, సాంబిరెడ్డి, కొండా జగన్మోహన్ రెడ్డి, బీవీ రెడ్డి, రమణారెడ్డి పటేల్ తదితరులు పాల్గొన్నారు.
0 Comment :
Post a Comment