రైతన్న కోసం.. పేదవాడి కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో 17 మంది ఎమ్మెల్యేలకు నేను చెప్పిన మాటలను నా జీవితంలో మరచిపోలేను. పదవులు ఇవ్వాళ ఉంటాయి.. రేపు పోతాయి.. కానీ.. విలువలు ముఖ్యం. రాజకీయాల్లో ఎన్నాళ్లు బతికామన్నది కాదు ముఖ్యం.. ఎలా బతికామన్నది ముఖ్యం అని వారికి చెప్పా. వారు నా మాటలు గౌరవించి విలువలకు.. నిజాయతీకి కట్టుబడి రైతన్నకు, పేదవాడికి అండగా నిలిచారు. అవిశ్వాస తీర్మానంలో ఓటేశారు. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే.. తాము డిస్‌క్వాలిఫై అయి ఉప ఎన్నికలు వస్తాయని తెలిసినా.. ఉప ఎన్నికల్లో మంత్రులు మోహరిస్తారని.. వార్డు వార్డుకూ డబ్బు మూటలు కుమ్మరించి ఆప్యాయతలు, అనురాగాలను గుండుగుత్తగా కొంటారని తెలిసినా.. పోలీసులను తమ గుప్పిట్లో పెట్టుకుని, తమను వ్యతిరేకించిన వారిని స్టేషన్లలో వేస్తారని.. అన్యాయంగా కేసులు పెడతారని తెలిసినా ఆ 17 మంది వెనక్కి తగ్గలేదు. రైతన్న కోసం.. పేదవాడి కోసం పదవులు వదులుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో రైతన్న, పేదవాడు ఒక వైపు.. కుళ్లు కుతంత్రాల రాజకీయాలు మరొక వైపు ఉన్నాయి. రైతన్నకు, పేదవాడికి అండగా నిలిచిన వారికి ఓటేసి ఈ ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా నడిపిస్తోన్న కాంగ్రెస్ పెద్దలకు కనువిప్పు కలిగించండి.. మీ ఓటు ద్వారా విలువలతో కూడిన రాజకీయాలను మళ్లీ తీసుకువద్దాం.
అనంతపురం నుంచి మైనార్టీని ఎమ్మెల్సీని చేస్తా
అనంతపురంలో మైనార్టీలు అధికంగా నివసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మహిళకు ఇక్కడ టికెట్ ఇచ్చింది. అయినప్పటికీ మైనార్టీలు నాకు అండగా నిలుస్తున్నారు. జన్మలో మీ సహకారాన్ని మరువలేను. కచ్చితంగా సువర్ణయుగం త్వరలో వస్తుంది. ముఖ్యమంత్రి స్థానంలో మీ అన్నయ్య కూర్చుంటాడు. ఆ సువర్ణయుగం ప్రారంభం కాగానే అనంతపురం నుంచి మైనార్టీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తాం. మొదటి జాబితాలోనే ఆ పేరు ఉంటుందని హామీ ఇస్తున్నా. - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
0 Comment :
Post a Comment