‘ఆంధ్ర మదిల్ భూమ్‌రంగ్’ శీర్షికతో ఠాక్రే రాసిన సంపాదకీయంలో కాంగ్రెస్ సహా ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీని కూడా ఎండగట్టారు. ఉపపోరులో కాంగ్రెస్ మట్టికరిచిందని వ్యాఖ్యానించారు. 18 అసెంబ్లీ స్థానాల్లో 15 సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిందన్నారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని ప్రజలు పక్కనబెట్టారని, వారి ఎన్నికల గుర్తు సైకిల్‌ను ప్రజలు పాత ఇనుపసామాన్లతో జమకట్టారని ఘాటుగా పేర్కొన్నారు. ‘ఉప తీర్పు కాంగ్రెస్‌కు ప్రమాదఘంటిక. అక్కడి ప్రజలు తమ పాలకులుగా ఎవరిని కోరుకుంటున్నారో ఓటు ద్వారా తెలియపరిచారు.’ అని ఠాక్రే రాశారు.
బెడిసికొట్టిన కాంగ్రెస్ కుట్ర..
జగన్‌పై కాంగ్రెస్ పన్నిన కుట్ర బెడిసికొట్టిందని బాల్ ఠాక్రే అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన దివంగత రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అనంతరం, ఆయన కుమారుడు జగన్‌కు కాంగ్రెస్ పార్టీలో ఆదరణ కరువైందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీనుంచి వెలుపలికి వచ్చి ప్రజలను ఆశ్రయించారని, వారి ఆదరణ చూరగొన్నారని విశ్లేషించారు. జగన్ ప్రజాదరణ పొందడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ అధిష్టానం అక్రమాస్తుల పేరుతో సి.బి.ఐ. దర్యాప్తు ప్రారంభించిందని పేర్కొన్నారు.
అరెస్టు కూడా కుట్రే!
ఉప ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఉండేందుకు జగన్‌ను జైల్లో పెట్టించిందని కాంగ్రెస్‌పై బాల్ ఠాక్రే నిప్పులు చెరిగారు. అయితే, ఈ చర్య కాంగ్రెస్‌కే నష్టం తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం మార్చే అవకాశం లేకపోలేదని ఠాక్రే రాశారు. అయితే, ఇది వారి పార్టీ అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు.
1 Comment :
Mari Jagan gadi meeda vrasina negative comments anduku delete chesav raa
Post a Comment