fvz

Wednesday, June 20, 2012

NRI's Demanding For Jagan To Be Release

ఉప ఎన్నికల్లో 15 అసెంబ్లీ, నెల్లూరు లోక్‌సభ స్థానాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం తమకు సంతోషాన్ని కలిగించిందని ఫ్లోరిడాలోని ఎన్నారైలు తెలిపారు. ఈ సందర్భంగా విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి దుర్దినాలు ప్రారంభమయ్యాయని వారు పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇంకా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బ్రిటీష్ వారి పరిపాలన సాగిస్తున్నారన్నారు. దీనిని అందరూ సమైక్యంగా అడ్డుకోవాలని వారు సూచించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయ్యాలని ఎన్నారైలు డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్, షర్మిలాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతటి విజయాన్ని చేకూర్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. పరకాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్థి భిక్షపతితో నువ్వానేనా అన్నట్లు తలపడ్డారని, అయితే చివరకు స్వల్ప తేడాతో సురేఖ ఓటమిని చవిచూడడంతో కొంత నిరాశకు గురైనట్లు ఫ్లోరిడా ఎన్నారైలు పేర్కొన్నారు. డాక్టర్ వాసుదేవ రెడ్డి నలిపిరెడ్డి, రామచంద్రరెడ్డి అక్కవరమ్, రఘు పాడి, డాక్టర్ శ్రీకాంత్ రామ్, పరంధామ రెడ్డి, చందు తల్లా, వీరారెడ్డి.కె, ప్రభాకర్, సుభాష్ వజ్జా, రామకృష్ణ, సయ్యద్ ఫాజిల్, షకీలా సయ్యద్, డాక్టర్ మోహన్ కొండా, జె.డి. ఏలేటి, విజయ్ కలకట్ట, మధు పొంగుమట్టి, రఘునాథ్ కొండా, లక్ష్మణ్ రెడ్డి కసి, అధినారాయణ లాగుడు, బొజ్జా ఆర్ కమలాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top