కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఆ హెలికాప్టర్‌లో ఎందుకు ఎక్కలేదు
: షర్మిల‘‘నాన్న తెచ్చిన అధికారాన్ని వాడుకుని కాంగ్రెస్ పెద్దలు మా కుటుంబాన్నే వేధిస్తున్నారు. సీబీఐ విచారణ పేరుతో జగనన్నను జైలుపాలు చేశారు. సింహం బోనులో ఉన్నా సింహమే అని వారు గుర్తెరిగేలా ఉప ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలి’’ అని వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల.. ప్రజలకు పిలుపునిచ్చారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సీబీఐ.. జగన్ కేసులో ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ‘‘నాన్న సెప్టెంబర్ 2న హెలికాప్టర్‌లో చిత్తూరు జిల్లాకు పయనమయ్యారు. ఆ రోజు ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా నాన్నతో కలిసి ఆయన సొంత జిల్లాకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన వెళ్లలేదు. మరి హెలికాప్టర్ ప్రమాదం తెలిసే వెళ్లలేదా? తెలియక వెళ్లలేదా?’’ అని షర్మిల అనుమానం వ్యక్తం చేశారు.
మీ ఓట్లు వైఎస్సార్‌పైనే: ‘‘పేదల కోసం, రైతుల కోసం పదవులు త్యజించిన ఎమ్మెల్యేలను మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. మీరు వేసే ప్రతి ఓటు వైఎస్సార్‌కు వేసినట్లే. మీరు వేసే ప్రతి ఓటు జగన్‌కు వేసినట్లే. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కుళ్లు, కుతంత్రాలను కడిగేసేందుకు మీ ఓటే ఆయుధం. జైలుగోడలు బద్దలయ్యేలా ఉప ఎన్నికల్లో మీరు తీర్పు చెప్పాలి. మా కుటుంబానికి అండగా నిలిచిన వారిని గెలిపించండి’’ అంటూ విజయమ్మ ప్రజలను అభ్యర్థించారు.
0 Comment :
Post a Comment