
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 63వ జయంతిని అమెరికాలోని లాస్ఏంజెలెస్ లో వినూత్నరీతిలో నిర్వహించారు. వైఎస్సార్ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు వీరారెడ్డి నంద్యాల ఆధ్వర్యంలో జూలై 8న భూమికి పదివేల అడుగుల ఎత్తులో అభిమాన నేత జయంతిని అపూర్వరీతిలో జరిపారు. వీరారెడ్డితో పాటు వైఎస్సార్ ఫ్యాన్ క్లబ్ సలహాదారు నగేష్, సభ్యులు శ్రీకాంత్ రెడ్డి కోమటిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వీరబాబు అంబటి లాస్ఏంజెలెస్ నుంచి హెలికాప్టర్ లో గాల్లోకి ఎగిరారు.
హెలికాప్టర్ లో వైఎస్సార్ చిత్రపటం ముందు కేక్ ఉంచి కట్ చేశారు. వైఎస్సార్ ఫ్యాన్ క్లబ్ సభ్యులు చేసిన నినాదాలతో హెలికాప్టర్ ప్రతిధ్వనించింది. రాజశేఖరరెడ్డి క్లాస్ మేట్ డాక్టర్ ప్రేమ్ రెడ్డికు చెందిన న్యూపోర్ట్ బీచ్ హౌస్ పై ఈ వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ ఫౌండేషన్ అవార్డు అందుకున్న వైఎస్సార్ సన్నిహితులు డాక్టర్ ప్రేమ్ రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డిలకు వీరారెడ్డి అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మహానేత జయంతి వేడుకలు నిర్వహించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. |
0 Comment :
Post a Comment