ఆ దేశ అరాచకానికి సాక్షాత్తు పరమశివుడే, కేదారు , బదరి నుండి పారి పొయ్యే పరిస్థితి నేడు.
నాటి దేశ భక్తీ నేటి తరం లో మచు కైనా లేదు, దేశం నేను, నా పెళ్ళాం, నా వుద్యోగం , నా డబ్బు ఇదే నేటి తరానికి వున్న దేశ భక్తి. స్వార్ధం నిండిన యువతరం నేడు, ప్రజా పోరాటాలంటే ఇంట్లో టీవీ ముందు కూర్చొని పేస్ బుక్, ట్విట్టర్ లలో కంప్యూటర్ ద్వారా పోరాటం చెయ్యడమే నేటి తీరు,అవినీతి ఆకాశానికి చేరింది, న్యాయం చెప్పాల్సిన సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి పదవి 100 కోట్లకు అమ్ముడు పోతుంటే ఇక ఆ దేశం ఎటు పొతున్ది.
"మన " అనే భావన కంటే నేడు నేను, నా ప్రాంతం, నా కులం, ఇదే నేడు రాజ్యమెలుతున్నది.
చరిత్రలో, విగ్రహాలలో మిగిలి పోయిన నాటి తరం నాయకులూ , 100 తరాల కు సరి పడ దోస్తున్న నేటి నాయకులూ, చోద్యం చూస్తున్న ప్రజానీకం ఈ అరాచకం నుండి భారత మాత ను కాపాడాలంటే ప్రజా పోరాటాలే మార్గం, నాడు అల్లూరి పోరాటం, నేడు Chattisgarh లో మన ఆదివాసి సోదరి , సోదరులు చేస్తున్నారు.
ఈ రోజు ఇండిపెండెన్స్ డే కి భారత మాత, ముందు ముందు రోజులలో (ఉన్మాదం నెత్తికెక్కి అందరి తెలుగు తల్లి ని తెలంగాణా తల్లి, ఆంధ్ర తల్లి , రాయలసీమ తల్లి అన్నట్లు)
భారత మాత ను దక్షిణ మాత , ఉత్తర మాత, తూర్పు, పడమరల మాతలుగా లు గా మనం బ్రతికి ఉండగానే చూడాల్సి వస్తుందేమో???
0 Comment :
Post a Comment