సువిశాలమైన మహాభారత దేశం, నేడు దరిద్ర దీనమైన రాజకీయ, వ్యాపార కుళ్ళు వ్యవస్థలతో కొట్టుమిట్టాడుతున్న అతి ప్రాచీనమైన సాంప్రదాయ దేశం.
రాజకీయ వ్యవస్థ లో ఉన్న లోపాలను ఒక దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చూపించినా ,
పక్కనే ఉన్న పాకిస్థాన్ దేశం వెక్కిరించినా,
ప్రకృతి విలయంతో బదరినాథ్, కేదరినాథ్ లో సుమారుగా నలభైవేల (40000) మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినా,
వేల కోట్ల రూపాయిలతో భూములు,టెక్నాలజీ, టెలికాంలో స్కాములు చేసినా,
భారతదేశంలో అమితంగా ప్రేమించే క్రికెట్ క్రీడకు పురుగులు పట్టినా,
సామాన్య మానవుడికి నడ్డివిరిచే నిత్యావసర ధరలకు ఊహకి అందని రెక్కలు కట్టినా,
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పాతాళానికి కూరుకుంటున్నా,
ఒక ఆడ మనిషిని పది మంది మృగాలు నడిరోడ్డులో మానభంగం చేసినా,
అంతర్జాతీయ దేశాలలో భారతీయులిని కాల్చి చంపినా,
ఎయిడ్స్, కాన్సర్, గుండెపోటు వంటి జబ్బులు వెక్కిరించినా,
కల్తీ మద్యం, కల్తీకల్లు, కల్తీ సారాయి రాజ్యమేలుతున్నా,
ఆడ మనిషి మానానికి రేట్లు కట్టి, నడి రోడ్డులో అమ్ముకుంటున్నా,
టెక్నాలజీని వాడుకొని దోపిడీలు, దొంగతనాలు నకిలి కరెన్సీ చేస్తున్నా,
నిత్యం ప్రజలను చేడుదోవ పట్టించే ప్రసారాలను టి.వి. లు ప్రసారాలు చేస్తున్నా.
సిటీ బస్సులు, రైళ్ళు గవర్నమెంట్ సేవలు సమయాని అందకున్నా,
ప్రైవేటు ఆసుపత్రులు విచ్చల విడిగా దోచుకుంటున్నా,
ట్రాఫిక్ పోలీసులు నడి రోడ్డు మీద అడ్డంగా లంచం తీసుకుంటున్నా,
రైతులు నిత్యం ఉరివేసుకొని చస్తున్నా,
రాష్ట్రాలు రావణకాష్టంలా మారిపోయినా, , ,
ఇలా చెప్పుకుంటూ పోతే లెక్క లేనన్ని . . .
ఈ 120 కోట్ల మంది జనాలలో, కనీసం ఎందుకు ?? అని ప్రశ్నించే ఒక్క భారతీయుడు కూడా కరువే . . . .
ఈ 120 కోట్ల మంది జనాలను సక్రమమైన మార్గంలో పరిపాలించే ఒక్క నాయకుడు కూడా లేకపోవడం మన దేశ దౌర్భాగ్యమా ??????
ఇది నేడు మన సువిశాలమైన మహాభారత దేశం అంతర్జాతీయంగా మూటగట్టుకున్న అత్యంత దరిద్రదీనమైన గౌరవం !!!
0 Comment :
Post a Comment