fvz

Monday, November 18, 2013

'రాజకీయ నాయకులు 'ఇడియెట్స్', ఐటీ నిపుణులు 'అసంతృప్తి మూక'


ప్రముఖ శాస్త్రవేత్త, భారత రత్న సీఎన్ఆర్ రావు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను 'అసంతృప్తి మూక' , రాజకీయ నేతలను 'ఇడియెట్స్' అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'కేవలం డబ్బు కోసమే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు పనిచేస్తారు. వాళ్లు ఒక అసంతృప్తికి గురైన గుంపు' అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ నిపుణుడు, హత్య గురైన టెకీ, విడాకులు తీసుకున్న ఐటీ ప్రొఫెషనల్ అనే హెడ్డింగ్ లతో పేపర్లో రోజు వార్తలు చదువుతాను అని అన్నారు. చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ అసంతృప్తితో జీవితం గడుపుతున్నారు. వారి జీవితం చాలా దుర్భరంగా ఉంది అని వ్యాఖ్యానించారు. అంతేకాక వాళ్లు తమ పనిని ఎంజాయ్ చేయలేరని.. తాను 80 ఏళ్ల వయస్సులో కూడా ఎంత ఆనందంగా ఉన్నానో చూడండి అన్నారు. 
 
కేవలం క్రీడలకు, ఆర్మీ ఇతర అంశాలకే రాజకీయ నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారని.. సైంటిస్టులకు ఈ దేశంలో గుర్తింపు లేదు అని అన్నారు. 2005లో నోబెల్ బహుమతికి సమానంగా ఉండే డాన్ డేవిడ్ పురస్కారం తనకు లభించిందని, దాని విలువ ఒక మిలియన్ డాలర్లు అని అన్నారు. తనకు లభించిన పురస్కారం గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు అని అన్నారు. ఎప్పుడో ఒక్కసారి ఇచ్చే ఈ పురస్కారం ఇతర దేశాల్లో కూడా ఎవరికి లభించలేదని.. అలాంటిది తనకు లభిస్తే ఈ దేశంలో గుర్తింపు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో శాస్త్రీయ రంగానికి ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదని.. రాజకీయ నాయకులు ఇడియెట్స్ అని అన్నారు. శనివారం సీఎన్ఆర్ రావుకు సచిన్ తోపాటు భారత రత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top