తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుపై వర్మ ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో కేసీఆర్ లాంటి నాయకులు లేకపోవడం వల్లే అక్కడ విభజన రాజకీయాలు లేవేమోవని పేర్కొన్నాడు. కేసీఆర్ తన మకాం అమెరికాకు మార్చి ఆ దేశ పౌరులకు విభజన భావనలు, ఆలోచనల గురించి చెప్పాలని సూచించాడు. ఇలాంటి నాయకులు అమెరికాను విభజించాలని వాదించగలరని అభిప్రాయపడ్డాడు. వర్మ ఇంకా ఏం ట్వీట్ చేశాడంటే...
- అమెరికాలో ఏ రాష్ట్రం కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకోకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది.
- భారత్ లోని రాష్ట్రాలు ఎప్పుడూ సమైక్యంగా లేకపోవడం లేదా సమైక్యంగా ఉంచగల సామర్థ్యం భారతీయులకు లేకపోవడం విభజనకు కారణం కావచ్చు.
- రాష్ట్రాలను ఎలా సమైక్యంగా ఉంచాలో మనం అమెరికాను చూసి నేర్చుకోవాలి.
- అమెరికన్లు మద్యం, శృంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతారు. వేర్పాటు రాజకీయాల గురించి ఆలోచించేంత తీరిక వారికి ఉండదు.
- అమెరికాలో ఏ రాష్ట్రం కూడా విడిపోవాలని ఎందుకు అడగడం లేదు? అక్కడ కేసీఆర్ లాంటి సమర్థులైన నాయకులు లేకపోవడం వల్లేమో?
- కెసీఆర్ ఒకవేళ అమెరికా పౌరుడిగా వాషింగ్టన్ లో జన్మించినట్టయితే.. ఆయన తన జీవితంలో ఏం సాధించావారో చూడాలనివుంది.
0 Comment :
Post a Comment