ఉదయ్ కిరణ్ మృతి కి సంభందించి రకరకాల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి .ఆఫర్ లు లేక ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది అంటుంటే మరికొంతమంది మాత్రం ఫ్యామిలీ గొడవల వల్ల ఇలా చేసి ఉంటాడని అంటున్నారు
అయితే ఉదయ్ కి కొంతమంది సినీ పెద్దల వల్లనే అన్యాయం జరిగిందని నమ్మే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది .ఇప్పుడు ఉన్న చాల మంది హీరోల కంటే నటన పరంగా, గ్లామర్ పరంగా ఉదయ్ ఎన్నో రెట్లు నయమని కాని కేవలం బ్యాగ్రౌండ్ లేనందునే ఉదయ్ను తోక్కేసారని చెప్తున్నారు. .ఇప్పుడు అది నిజమేనా అన్నట్టు ఉదయ్ నటించి మధ్యలో ఆగిపోయిన సినిమాల లిస్టు బయటకు వచ్చింది.
షూటింగ్ మధ్యలో అనివార్య కారణాల వల్ల ఉదయ్ వి 9 సినిమాలు ఆగిపోయాయి .. వాటి వివరాల్లోకి వెళితే
1) పూరి జగన్నాధ్ దర్శకత్వంలో.. అంజన ప్రొడక్షన్స్ సంస్థ (నాగేంద్రబాబు) నిర్మాణంలో ఉదయ్ కిరణ్ జంటగా అసిన్ నటించాల్సిన సినిమా క్యాన్సిల్ అయ్యింది
2) ఉదయ్ రెండు భిన్న పాత్రలలో తమిళ దర్శక, నిర్మాత ఏఎం రత్నం సూర్య మూవీస్ ‘ప్రేమంటే సులువు కాదురా’ సినిమా దాదాపుగా ఎనబై శాతం షూటింగ్ పూర్తయ్యాక ఆగిపోయింది . ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం హైదరాబాద్ వచ్చినప్పుడు చిరు కాంపౌండ్ ఒత్తిడి మేరకే ఈ సినిమా రద్దు చేసామని చెప్పారని వార్తలు వస్తున్నాయి
3). బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో సగంపైగా తెరకెక్కిన ‘నర్తనశాల' సినిమా మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ అభిమన్యుని పాత్రలో నటించాడు.
4) ప్రత్యూష క్రియేషన్స్ బ్యానర్ లో ఉదయ్ కిరణ్ & అంకిత కాంబినేషన్ లో ఆగిపోయిన ఓ సినిమా.
5). హిందీ సినిమా జబ్ వుయ్ మెట్ తెలుగు వర్షన్ సన్నాహాలు జరగగా ఇందులో ఉదయ్ కిరణ్ కు జోడిగా త్రిషను కూడా ఎంపిక చేసిన తర్వాత సినిమా ఆగిపోయింది.
6). తమిళ, తెలుగు సినిమాలను నిర్మించే సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలో ఓ సినిమాకు సన్నాహాలు జరగగా ఇందులో ఉదయ్ కిరణ్ జోడిగా సదాను ఎంపికచేశారు.
7). ఆదిశంకరాచార్య అనే మరో సినిమా కూడా షూటింగ్ మొదలై ఆర్ధికపరమైన కారణాల వలన ఆ సినిమాకు షూటింగ్ దశలోనే బ్రేక్ లు పడ్డాయి.
8). అప్పటికే రెండు భారీ హిట్స్ దక్కించుకున్న ఎంఎస్ రాజు మనసంతా నువ్వే.. నీ స్నేహం తర్వాత ఉదయ్ తో మరో సినిమాకు కూడా సన్నాహాలు చేసారు. ఎందుకో ఈ సినిమా కూడా పట్టాలెక్కలేదు.
9). వైవిధ్యమైన కథలతో సినిమాలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి కూడా ఉదయ్ తో ఓ సినిమాకు రంగం సిద్దం చేసుకోగా నిర్మాతల కారణాల వలన ఆ సినిమా మొదలుకాలేదు.
ఈ ఆగిపోయిన సినిమాల చిట్టా చూస్తే.. నిజంగా ఇన్ని అవకాశాలు ఉదయ్ బ్యాడ్ లక్ వల్లనే పోయాయా? లేక అంటా ఆరోపిస్తున్నట్టు ఎవరైనా పెద్ద మనుషులు కావాలనే చేసారా అనే అనుమానం రాకమానదు..వీటిలో కనీసం సగం సినిమాలు కార్యరూపం దాల్చిన ఉదయ్ లైఫ్ మరోలా ఉండేదేమో అనిపిస్తుంది కదూ...
0 Comment :
Post a Comment