fvz

Thursday, March 27, 2014

Yellow Gang - Dirty Polytricks

పేరుకి మాత్రమే బాబుస్ "మహిళా గర్జన"..  
కానీ  ఐటంగర్ల్స్ తో  ఐటంసాంగులకి స్టెప్పులు వేయిస్తుంటే...
'చూసేవాడు సన్నాసి ఐతే, చెప్పేవాడు చండ్రబాబు' అనే ఓ సామెతలా ఉంది యవ్వారం....

Wednesday, March 26, 2014

Groom Pradeep Reddy Beaten By Bride's Family For Backing Out of Marriage

పెళ్లి పందిట్లోనే పెళ్లి కొడుకుని చితక్కొట్టారు
ఎంగేజ్‌మెంట్ ఎప్పుడో అయిపోయింది. ఇంకాసేపైతే పెళ్లి కూడా అయిపోయేది. తాళి కట్టి ఏడడుగులు వేయడం మినహా పెళ్లి పందిట్లో జరిగే తంతు అంతా పూర్తయ్యింది. ముహూర్తం ప్రకారం జీలకర్ర బెల్లం కూడా పెట్టారు. ఇంతలోనే వరుడు ప్లేటు ఫిరాయించాడు. ఈ అమ్మాయి నాకు నచ్చలేదు.. తాళి కట్టనంటూ మొండికేశాడు.
జరిగింది తెలుసుకుని నివ్వెరపోయిన వధువు బంధువులు పెళ్లి కొడుకుని చితక్కొట్టారు. పెళ్లికి సిద్ధమైన వధూవరులిద్దరికీ ఇది రెండో పెళ్లి. ముందు అన్నీ చర్చించుకున్న తర్వాతే పెళ్లికి సిద్ధమయ్యారు. అబ్బాయికి కట్నంగా రూ.18 లక్షలు,  20 తులాల బంగారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఓ ఫ్లాట్ కూడా కట్నంగా రాయించుకున్నారని వధువు కుటుంబసభ్యులు వాపోతున్నారు.

ఇంత జరిగాక పెళ్లి చేసుకోనని మొరాయిస్తే ఎలా అని వధువు తల్లిదండ్రులు ఎంత బతిమాలినా పెళ్లి కొడుకు పట్టించుకోలేదు. ఇక ఇలా మాటల్తో చెబితే లాభం లేదనుకున్న వధువు తరుపు బంధువులు అబ్బాయి ఒళ్లు హూనం చేసి పోలీసులకు అప్పగించారు. మా అమ్మాయి మంచిదే అయినప్పటికీ, ''అమ్మాయి క్యారెక్టర్ ఎటువంటిది'' అని ఆరాతీశాడని వధువు తరుపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ పెళ్లి సంబంధం మ్యారేజ్ బ్యూరో ద్వారా కుదిరినట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు వరంగల్ జిల్లా హన్మకొండలోని ఓ ఫంక్షన్ హాలు వేదికయ్యింది. వరుడు ప్రదీప్ రెడ్డిది మెదక్ జిల్లా సిద్ధిపేట, వధువుది వరంగల్ జిల్లా గూడూరు.

పార్టీలు పెట్టి అమ్ముకోవడంలో అన్నాదమ్ముళ్ల స్టైలే వేరట

'' పార్టీలు పెట్టి అమ్ముకోవడంలో అన్నాదమ్ముళ్ల స్టైలే వేరు. పార్టీలు పెట్టి అమ్ముకోవడంలో అన్నాదమ్ముళ్ల తర్వాతే ఇంకెవరైనా. అయినా ఎవరైనా ఫ్లాట్లు కొని అమ్ముకుంటారు.. లేదంటే ఇళ్లు కట్టి అమ్ముకుంటారు కానీ వీళ్లెవరండీ బాబు పార్టీలు పెట్టి బేరం చూసి అమ్మేసుకుంటున్నారు ''. ఇదంతా ఎవరో చెబుతున్న మాటలు కావు.. సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ రాసుకుంటున్న రాతలు. అందుకు చక్కటి ఉదాహరణే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో. 
ఇదే తరహా సెటైర్లు ఇంటర్నెట్‌లో అనేకం కనిపిస్తున్నాయి. ఆయా పోస్టుల్లో వున్న వాళ్లని అభిమానించే వారికి ఇది అంతగా మింగుడుపడకపోవచ్చేమో గానీ మిగతావాళ్లు మాత్రం లైకులు, షేర్లు కొట్టుకుంటూ ఆయా పోస్టులతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పాపం ఈ పోస్టుల బారిన పడుతున్న వాళ్ల దురదృష్టం ఏంటంటే... వాళ్లని అమితంగా అభిమానించే వాళ్లలో కూడా కొంతమంది '' అరే ఇదిగో మనోడిని పలానా వర్గపోడు ఇలా అన్నాడు.. అలా అన్నాడు '' అంటూ ఆ పోస్టుల్ని నలుగురికీ పంచుతున్నారు(షేర్లు కొడుతున్నారు). ఫలితంగా వాటి గురించి తెలియని మరో నలుగురికి కూడా అవి చేరిపోతున్నాయి. '' మీ అభిమానం తగలెయ్య... మీ కామెంట్లు, ప్రతికామెంట్లతో మమ్మల్ని వెనకేసుకొచ్చినట్లే వేసుకొచ్చి నలుగురి ముందు మరింత నవ్వులపాలు చేస్తుర్రు కదరా '' అని ఆయా పోస్టులబారిన పడిన బాధితులు ఫీలవుతున్నారట.

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top