కడప మేయర్ అభ్యర్థిగా సురేష్ బాబుకు మద్దతు పలకాలని కోరారు. అన్ని మతాలకు, కులాలకు తమ పార్టీ సమాన ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. కడప నుండే తాను ఈ రాష్ట్రానికి సందేశం ఇస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల తర్వాత చంద్రబాబు అబద్దాలు, మోసాలు బయటకు వస్తాయని చెప్పారు. సాధారణంగా ఓ సిఎంపై వ్యతిరేకతకు రెండేళ్ల వరకు పడుతుందని, కానీ చంద్రబాబు పైన 25 రోజుల్లోనే అది కనిపిస్తోందన్నారు.
ఆ తర్వాత ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు రాని పరిస్థితి నెలకొందన్నారు. విశ్వసనీయత, విలువలకు తమ పార్టీ ప్రాధాన్యతనిస్తుందన్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను లాక్కొని దుష్ట రాజకీయాలకు టీడీపీ పాల్పడుతోందన్నారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్సీలను కూడా లాక్కుంటోందన్నారు. ఇలాంటి ఆకర్షణలతో గెలిస్తే ఎంత.. గెలవకుంటే ఎంత అన్నారు.
ఎమ్మెల్సీలను లాక్కోవడంలో నిజమైన ప్రతిపక్షం లేదన్నారు. నిజమైన ప్రతిపక్షం అంటే ప్రజలు అన్నారు. మోసం చేస్తే ప్రజలు తిరగబడతారన్నారు. ప్రస్తుతం ప్రజలు తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా భవిష్యత్తులో 160 స్థానాలు ఇచ్చి నిలబెడతారన్నారు. ఈ ఐదేళ్లు అందరం ప్రజలకు తోడుగా ఉందామన్నారు. మన పైన పోలీసుల కేసులు, ఒత్తిళ్లు అనేకం ఉంటాయన్నారు. ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా అందరం కలిసి పోరాడుదామన్నారు. మీ కోసం నేను రోడ్డు పైకి వచ్చేందుకు సిద్ధమన్నారు.
ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రలోభాలకు పాల్పడుతోందన్నారు. విలువలు లేని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. అమలు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన బాబు నైజాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. నాలుగేళ్లు బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాడాలని, పార్టీ అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.
0 Comment :
Post a Comment