fvz

Thursday, June 26, 2014

చందమామ ముఖంలో చంద్రోదయ పవనాలెక్కడా ?

ఆంధ్రుల ముఖంలో ఆనందం లేదు



చంద్రబాబు... ఈరోజుల్లో ఈ బహుదూరపు బాటసారి పేరుని 13 జిల్లాలోని ఆంధ్రులు తలుచుకొని రోజంటూ ఉండదు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కేవలం ఈ MA ఎకనామిస్ట్ చంద్రబాబు మాత్రమే ఆంధ్రా ని "సింగపూర్" గా చేయగలరని నమ్మిఅధికార పీటం ఎక్కించారు. ఒక వైపు ఆంధ్ర రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉండింది అని తెలిసి హంగూ  ఆర్భాటాలతో ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించి దాదాపుగా నెల రోజులు కావస్తున్నా తాను చేయవలసిన పని ఏమిటో.. ప్రజా సంక్షేమం దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమిటో, చేయదలచుకున్న పనులు ఏమిటో ఆయన ఇప్పటిదాకా నిరూపించుకోలేదు. 

చెప్పుకోడానికి బాబుగారు  తన  ప్రమాణస్వీకారం నాడు  5 సంతకాలు అయితే చేశారు గానీ, వాస్తవంగా అందులో కార్యరూపంలోకి వచ్చినది ఒక్కటంటే ఒక్కటే. ఉద్యోగుల పదవీవిరమణ కాలాన్ని పెంచడం మాత్రం అయింది. ఇతరత్రా బాబుగారి  ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం పనిచేసిందంటే జవాబు చెప్పడానికి మనం మాటలు వెతుక్కోవాల్సిందే. ప్రపంచానికే  పాఠాలు చెప్పిన ఈ MA ఎకనామిస్ట్ మాష్టారు తను ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి ఒక సామాన్యుడి ఆవేదనను ప్రతిపక్ష నేత ప్రశ్నించగా ఒక్కటి అంటే ఒక్కటి కూడా సమాధానం లేదు. ఆట మొత్తం అయ్యాక తూచ్ అన్న చంద్రబాబు ఈయన గారి మంత్రి వర్గాన్ని చూసి ఒక సామాన్య ఆంధ్రుడు మళ్ళి ఈ అయిదేళ్ళ ఆటలో ఓడిపోయాం అని నెత్తి నొరూ బాదుకుంటు న్నారు.


జగన్ గారు ఒక  ప్రతిపక్ష నేతగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బాబు గారిని సూటిగా ఒక ప్రశ్నవేసారు. అదే రైతుల రుణ మాఫీ గురుంచి. ఫలానా తారికునుంచి రైతుల రుణాలు మాఫీ చేస్తాం అని ఒక్క మాట చెప్పండి మహాప్రభో అని. దానికి బాబు గారి MA ఎకనామిస్ట్ సంధానం చూసి ప్రతిపక్ష నేత గా జగనూ, టి.వి. లు చూసిన సామాన్య ఆంధ్రుడికి సైతం ఒక్కసారిగా మైండ్ లు బ్లాంక్ అయ్యాయి. ఆంధ్రా రైతులు రుణ మాఫీ ఫై ఆశలు ఒదులుకొని కనీసం ఎండలు అయినా తగ్గు ముఖం పడతాయని ఆకాశం వైపు చూసుకుంటున్నారు.  


ప్రశ్నించటానికే జనసేనా పార్టీ నెలకొల్పిన పవన్ ఎక్కడా?



ఎక్కడున్నావయ్యా..పవనూ..ఫాంహౌస్ లో కూర్చుని మిత్రులకు మామిడి పళ్ల బుట్టలు పంపడం వరకు బాగానే వుంది..కానీ ఇక్కడ పశ్నించాల్సిన పనులు పెండింగ్ లో వుండిపోతున్నాయి. కాస్త ప్రశ్నించవా పవనూ.. కూత వేటు దూరంలో రైల్వే బడ్జెట్ వుండగా, ఆదరా బాదరా రైల్వే చార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చిందని మిత్రుడు మోడీని... కర్నూలుకు ఎయిమ్స్ అని కేంద్రం అంటే, తీసుకెళ్లి కృష్ణా-గుంటూరు జనాలు కైకర్యం చేసేస్తే... ఇదిగో రుణమాఫీ అన్నవాళ్లు, కమిటీలు, కేంద్ర సాయం ఆర్బీఐ అనే కుంటి సాకులు చెబుతుంటే.. ఆగిపోయిన పింఛన్లను తిరిగి ప్రారంభించేదిపోయి, మరో మూడు నెలల తరువాతకు వాయిదా వేస్తే.. నిత్యావసర ధరలు అయిన గ్యాస్ రేట్ పెరుగుదల ఫై, వడ గాల్పుల దెబ్బకి పిట్టల్లా రాలిపోతున్న ఆంధ్రులకి ప్రభుత్వం భరోసా ఇవ్వటం ఫై వచ్చి త్వరగా ప్రశ్నించు పవనూ..ప్రశ్నించు. లేకుంటే జనం మిమ్మల్ని ప్రశ్నించేసే ప్రయత్నం చేస్తారు.

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top