fvz

Monday, October 27, 2014

Uncle Varma గారి Term అయిపోయిందా?

Penmetsa Ram Gopal Varma Born - 7 April 1962 (Age 52)

















రామ్ గోపాల్ వర్మ...!!! ఈయన జన జీవన స్రవంతిలోకి రాడా? లేక జనమంతా ఆయన జీవన స్రవంతిలోకి రావాలనుకుంటున్నాడా ..!! రామ్ గోపాల్ వర్మా.. ఒక ఆలోచనల పుట్టా. ఈ ఆలోచనలు  ఆయన వోడ్కా వేడి నుంచి పుట్టాయా! లేక ఆయన ఒరిజినల్ మేటలే అంతా! అంతే కాదు అది మేటలో లేక ఇంకోటో కూడా అర్థంకాదు.

"మెదడు అనే పదార్థం పనిచేయడానికి రకరకాల రసాయనాలు అవసరాలు ఉంటాయి అంటుంటారు. సదరు కెమికల్స్ నిష్పత్తి సమత్యులత్త అనబడే ప్రపోర్స్నన్ల బాలన్స్ తప్పితే ఆ మెదడు పని చేసే విధానం కూడా దెబ్బతింటుందంటారు శాస్త్రజ్ఞులు".




















అసలు ఇక్కడేం జరుగుతుంది. తాజాగా వర్మ గారు తన సినిమా ఫస్ట్ లుక్ అంటూ ఓ ఫోటో విడుదల చేసారు. ప్రవరాక్యుడిని సైతం చేలింప చేసే భంగిమలో ఉన్న స్రీని తదేకంగా అదోరకం తన్మయత్వంతో చూస్తున్న టీనేజ్ బాలుడు ఫోటో అది. ప్రతీ టీనేజేర్ జీవితంలో ఓ సావిత్రి ఉంటుందని, స్కూల్లో చదువుకునే రోజుల్లో మా ఇంగ్లీష్ టీచర్ 'సరస్వతి' అంటే పిచ్చేక్కిపోయేదంటు వర్మ చెప్పుకొచ్చారు. సావిత్రి అలియాస్ శ్రీదేవి సినిమాగా తెరకేక్కిస్తున్నాం అంటూ వర్మ గారి స్టేట్మెంట్స్.  అంతటితో ఈ వర్మ ఆగలేదు. 

మీ మీ జీవితాల్లో ఉన్న సావిత్రిల్లున్ని లేదా శ్రిదేవుల్నిబయటకు తీసుకురండి.. మీ అనుభవాల్ని మాతో పంచుకొండంటూ... ఏకంగా ఓ వెబ్ సైట్ (www.naasaavitri.com) నే మొదలుపెట్టడాయన. ఇక పతివృద్ద్యం సబ్జెక్టు పెడార్థం పడుతోందన్న భయాల మీద ఇప్పుడు సావిత్రి పేరును తన ఆరాధ్య దేవత శ్రీదేవి గా మార్చుకున్నారు వర్మ. ఆ సైట్ లో ఈ అనుభవాలు రాసే కుర్రకారు సంగతి అలా ఉంచితే, ఈ విషయం మీద బాలల హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. సినిమా పోస్టర్ ఫై స్యూమోటో కింద కేసును స్వీకరించింది కూడా.  ఓ స్రీ అందాలను తొంగి చూస్తున్నా కుర్రాడి ఫోటో గురించి ఇంత రచ్చ జరిగిపోవాలా అన్న ప్రశ్న కొంతమందికి రావొచ్చు. మీ మీ అందరి జీవితాల్లో తారసపడ్డ సావిత్రిలందరి ఇన్స్పిరేషన్ తోనే ఈ సావిత్రి అలియాస్ శ్రీదేవి సినిమా తీస్తానంటున్న వర్మ ఆలోచనల్లో తప్పేమీ కనపడటం లేదా?

బాల్యానికి యవ్వనానికి మధ్య దశ అత్యంత సున్నితమైన వయస్సు. అక్కడ జరిగిపోయే ఆలోచనల్లో అసభ్యకరాలేమి లేకపోవొచ్చు. కానీ అటువంటి ఆలోచనలు అగమ్యగోచరంగాను గందరగోళంగాను ఉంటాయన్నది మాత్రం ఒక నిజం. నిజ జీవితాలకి ఫాంటసీలకి మధ్య ఉగిసలాడుతూ ఉంటాయి. చాలా సార్లు ఫాంటసీ లు ఊహా లోకాల్లో విహరిస్తుంటాయి కూడా. అంతే కాదు అప్పుడు అక్కడ పడిపోయే కొన్ని అడుగులే జీవితాలనే బలి తీసుకుంటాయి. సెక్స్ పట్ల విద్యార్థుల్లో అవగాహన అవసరమే కావొచ్చు. కానీ దాన్ని వివరించటానికి బూతు చిత్రాల అవసరం మాత్రం లేదు. 

కుర్రాళ్లలో సహజంగా రేకెత్తే కొన్ని ఆలోచనలకు అక్షర రూపాన్ని ఇవ్వడమో లేక దృశ్య పరంగా చూపించడంలో తప్పేమీ లేకపోవొచ్చు గానీ, ఇక అటువంటి ఆలోచనల్ని మాతో పంచుకుంటే వాటి ఆధారంగా సినిమా తీస్తానని దానికి ఏకంగా ఒక వెబ్ సైట్ దుకాణాన్ని తెరిచిన వైనం మాత్రం చాలా చికాక్ గా ఉంది. దీన్ని మనం చికాక్ గా ఉందంటూ తేలిగ్గా తీసిపారేసినా, చాలా చీప్ గా ఉంది అనేవాళ్ళు లేకపోలేరు. సమాజం కొత్త పోకడల్ని, భిన్నాభిప్రాయాల్ని ఒక పట్టాన స్వీకరించదు. నేనొక సోక్రటీసు లాంటోడిని, నన్ను అసహ్యించుకున్నా ఇదే నిజమంటూ మన వోడ్కా వర్మా సణుగ్గోవొచ్చు లేక బిగ్గరగా అరవొచ్చు గాకా. 

అది ఆయన పబ్లిసిటీ స్టంటే కావొచ్చు.అసలు టీనేజ్ కుర్రాళ్ళంత తమకంటే వయసులో చాలా పెద్దయిన మహిళల్ని కేవలం సెక్స్ దృష్టితో మాత్రమే చుస్తున్నారన్న ఒక బలమైన వాదన చాలా కాలంగా ప్రచారంలో ఉంది. అనేక సర్వేలు ఇవి తప్పని ఋజువుచేసాయి కూడా. సైకాలజీ జర్నల్స్ లో వీటికి సంభంధించిన ఆర్టికల్స్ అసలు నిజాలను వెలికి తీసే ప్రయత్నాలు చేసాయి.


కేవలం సెక్స్ మాత్రమే కాదు..తమ ఈడు ఆడ పిల్లల పట్లా వాళ్ళకున్న అభిప్రాయాల్లో ప్రేమ, జీవితాన్ని పంచుకోవడం పట్ల ఆలోచనలు, ఉద్రేకాలూ కూడా ఉంటాయని  కేవలం అవతలి ఆడ పిల్లల లుక్స్ మాత్రమే వాళ్ళకి ప్రధానం కాదన్నది ఒక వాస్తవమని తేలిపోయింది. ఎటొచ్చి Adolescence అనబడే యవ్వన ప్రారంభ దశలో అపరిపక్వంతో ఉండే కుర్రోళ్ళకు, మనోళ్ళు చూపించే బూతు సినిమాలు లేదా వాళ్ళని ప్రేరేపితుల్న్నిచేసే సన్నివేశాలు మాత్రమే పక్కదార్లు పట్టించే అవకాశాల్నిపెంచుతాయన్నది నిజం. ఐతే మీరంతా హిపోక్రాట్స్, మనసులో ఒకటి పెట్టుకొని భేషజాల కోసం మరొకటి మాట్లడతారంటూ వాదనలు వినిపించే వాళ్లకు సమాజం పోకడల పట్ల అభ్యంతరాలు సహజంగానే ఉంటాయి. అటువంటి వాదాలను అడ్డం పెట్టుకొని అబ్బాయిలు ఆంటీలంటూ అవాస్తవిక కల్పనలని, అతిశయలని క్రిఎట్ చేసి ట్రాన్స్ లోకి యువతని తీసుకెళ్లడం ఖచ్చితంగా దుర్మార్గమే అవుతుంది. 

ఇప్పటికే రకరకాల రుగ్మతలతో కునారిల్లుతున్నమన సమాజం వీటిని నియంత్రించి కొంతలో కొంత అయినా ఒక ఆరోగ్యకరమైన పట్టుదలని పెంచి వాళ్ళని ఇటువంటి కల్చరల్ షాక్ లకు గురి కాకుండా దూరం జరపాలని వాదిస్తే తప్పెలా అవుతుంది. ఎప్పుడూ హాలీవుడ్ సినేమాన్లో, ఎవరో ఒకరి క్రైమ్ జీవితాల ఆధారంగా చేసుకొని టాలీవుడ్లో సినిమాలు తీసే అంకుల్ వర్మ గారు చివరకి ఇలా దిగజారి ఓ బూతు సినిమాల తీసే స్థాయికి దిగజారిపోవడం దురదృష్టకరం. 

రామ్ గోపాల్ వర్మ టర్మ్ అయిపోయిందా లేక మన ఖర్మ ఇలా కాలిపోయిందా??

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top