“People are saying that I have to go back to Kalyan, but to where or to whom I have to go back. Pawan has moved on, I can’t go back to move in with him again and disrupt is privacy,” said pawans Ex- wife Renu.
“ I hear people say love is blind, but in my case it is also dumb and deaf. I fell in love with kalyan when I was 18. We thought he will get divorce in 6 months of time. unfortunately it took 8 long years," she confessed about her live-in relationship with Pawan.
She broke into tears when the host asked her "How she cope up with the loneliness?". She answered openly to the question. " I still don't know how people cope up with the loneliness. I still dont know how to move on. for me, if we love a person it will be till the end. That's my perspective of love. I really tried very hard to be with pwan till the end. I even argued with a lawyer in the matter. But in the end its a matter of destiny. I have to accept it," she admitted.
Renu Desai full interview :
మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో డిసెంబర్ 4, 1981లో దేశాయ్ జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్.
‘బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది.
బలవంతగా ఆయన వద్దకు కుదరదు: రేణు దేశాయ్ కంటతడి
18 ఏళ్ల వయసులో బద్రి సినిమా చేయడానికి హైదరాబాద్ వచ్చానని, మొదటి చూపులోనే ఆయన (పవన్ కళ్యాణ్) ప్రేమలో పడ్డానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. తొలుత ప్రపోజ్ చేసింది మాత్రం ఆయనే. 19 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాను. అయితే అది అఫీషియల్ గా జరుగలేదు. ఎందుకంటే అప్పటికే ఆయనకు(పవన్ కళ్యాణ్) పెళ్లయింది. ఈ విషయం ఆయన నాకు ముందే చెప్పారు. మొదటి భార్యతో విడాకుల కేసు కోర్టులో ఉంది...అది ఎంతకాలం అవుతుందో తెలియదు. అందుకే కలిసి సహజీవనం చేసామని రేణుదేశాయ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
చాలా మంది ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు మళ్లీ వెనక్కి వెళ్లాలని, ఆయనతో కలిసి ఉండాలని అడుగుతున్నారు. కానీ నేను అలా చేయలేను. అలా చేసి ఆయన్ను ఇబ్బంది పెట్టలేను. ఆయన ప్రైవసీకి భంగం కలిగించలేను. మీరంతా అడుగుతున్నారని బలవంతంగా ఆయన దగ్గరకు వెళ్లడం కుదరదు. మీరు వెళ్లమంటే వెళ్లాలా? అయినా ఎక్కడికి వెళ్లాలి? ఇలాంటి సలహాలు ఇచ్చే వారు కూర్చుని ఆలోచించాలి...అంటూ వ్యాఖ్యానించారు రేణు దేశాయ్.
నేను ఆయనతో విడిపోయిన తర్వాత ఆయన నుండి 40 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయాలు బయట విని ఆయన నాకు ఫోన్ చేసి ఆశ్చర్యపోయారు. నేను ఆయన నుండి ఎలాంటి డబ్బు తీసుకోలేదు. సన్నిహితులందరికీ ఈ విషయం తెలుసు అన్నారు రేణు దేశాయ్.
ఆయనతో కలిసి పదేళ్లకుపైగా జీవించాను. ఇద్దరం కలిసి కాపురం చేసాం. మేము ఎందుకు విడిపోయామనే విషయం మా ఇద్దరికి మాత్రమే తెలుసు. ఇప్పటికే నేను చెప్పేది ఒక్కటే...నాది హ్యాపీ మ్యారిడ్ లైఫ్. మేము సెలబ్రిటీలం కాబట్టి ఎందుకు విడిపోయామనే విషయం అందరికీ చెప్పాలని కొంత మంది అడుగుతున్నారు. మేము సెలబ్రిటీలం అయినప్పటికీ మాకు పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. మా ప్రైవసీకి గురించి కూడా అందరూ ఆలోచించాలి అన్నారు రేణు దేశాయ్.
తమ మధ్య పెద్దగా గొడవలు ఏమీ లేవు. ప్రశాతంగా, సుఖంగా విడిపోయారు. తాము ఎందుకు విడిపోయామనే విషయం నాకు ఆయనకే తెలుసు. భార్యా భర్తల మధ్య ఎవరూ మాట్లాడకూడదను అని పెద్దలు అంటుంటారు....అంటూ దాట వేత ధోరణి ప్రదర్శించారు రేణు దేశాయ్.
0 Comment :
Post a Comment