Srikakulam
DHARMANA KRISHNA DAS
constituency: Narsannapeta
Age: 64
Education: B. Com
రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక. ప్రస్తుతం రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
Vizianagaram
Botsa Satyanarayana constituency: Cheepurupalli Age: 61 Education: B.A. రాజకీయ అనుభవం: నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. |
Pamula Pushpa Sreevani
constituency: Kurupam Age: 31 Education: B.Sc. రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. |
Visakhapatnam
Muttamsetti Srinivasa Rao (Avanthi) Srinu
constituency: Bhimili
Age: 52
Education: Intermediate
రాజకీయ అనుభవం: ఒకసారి ఎంపీ, రెండుసార్లు ఎమ్మెల్యే
Age: 52
Education: Intermediate
రాజకీయ అనుభవం: ఒకసారి ఎంపీ, రెండుసార్లు ఎమ్మెల్యే
East Godavari
Pilli Subhash Chandra Bose constituency: Mandapeta Age: 69 Education: B.Sc. రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యే, వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. |
Viswarupu Pinipe constituency: Amalapuram Age: 55 Education: B.Sc., B.Ed రాజకీయ అనుభవం: రెండు సార్లు ఎమ్మెల్యే. వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. |
Kurasala Kannababu constituency: Kakinada Rural Age: 46 Education: B.Com, B.A. రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజారాజ్యంలో కీలక నేతగా పనిచేశారు. |
West Godavari
Taneti Vanita constituency: Kovvur Age: 45 Education: M.Sc. రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. |
Cherukuwada Sri Ranganatha Raju constituency: Achanta Age: 66 Education: Intermediate రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. |
Alla Kali Krishna Srinivas (Nani) constituency: Eluru Age: 49 Education: B Com రాజకీయ అనుభవం: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం. కాంగ్రెస్‌లో వివిధ స్థాయిల్లో పనిచేశారు. |
Krishna
Kodali Sri Venkateswara Rao ( Kodali Nani)constituency: Gudivada Age: 47 Education: 10th Class రాజకీయ అనుభవం: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. |
Vellampalli Srinivas constituency: Vijayawada (West) Age: 48 Education: 10th Class రాజకీయ అనుభవం: రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం. ప్రజారాజ్యం, కాంగ్రెస్, భాజపాలో పనిచేశారు. |
Perni Venkataramaiah (Perni Nani)
constituency: Machilipatnam Age: 49 Education: B.Com. రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. |
Guntur
Mekathoti Sucharitha constituency: Prathipadu Age: 41 Education: B.A.Caste: SC రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. |
Mopidevi Venkata Ramana Rao constituency: Repalle Age: 55 Education: B.Com. రాజకీయ అనుభవం: మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. |
Prakasam
Balineni Srinivasa Reddy (Vasu) constituency: Ongole Age 55 Education: Intermediate రాజకీయ అనుభవం: ఐదుసార్లు ఎమ్మెల్యే, వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. |
Adimulapu Suresh constituency: Yerragondapalem Age: 45 Education: I R S రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పీఏసీ సభ్యుడిగా, వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. |
Nellore
Mekapati Goutham Reddy
constituency: Atmakur Age: 45 Education: M.Sc. (Textiles) రాజకీయ అనుభవం: రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. |
Poluboina Anil Kumar
constituency: Nellore City Age: 39 Education: B D S రాజకీయ అనుభవం: ఒకసారి కార్పొరేటర్‌గా.. రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు |
Kurnool
Buggana Rajendranath Reddy constituency: Dhone Age: 47 Education: B.E. రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం. పీఏసీ ఛైర్మన్‌గానూ పనిచేశారు. |
Gummanur Jaya Ram constituency: Alur Age: 51 Education: 10th Class రాజకీయ అనుభవం: జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. |
Chittoor
Peddireddy Ramachandra Reddy
constituency: Punganur Age: 67 Education: M.A. P. hd (Sociology) రాజకీయ అనుభవం: ఆరు సార్లు ఎమ్మెల్యే, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రి. |
Kalattur Narayana Swamy constituency: Gangadhara Nellore Age: 51 Education: B. Sc. రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. |
Kadapa
Amzath Basha Shaik Bepari
constituency: Kadapa
Age: 48
Education: B.A.
రాజకీయ అనుభవం: కార్పొరేటర్‌గా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
constituency: Kadapa
Age: 48
Education: B.A.
రాజకీయ అనుభవం: కార్పొరేటర్‌గా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Anantapur
Malagundla Sankaranarayana
constituency: Penukonda
Age: 54
Education: B.Com. LLB
రాజకీయ అనుభవం: అనంతపురం జిల్లా వైకాపా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
constituency: Penukonda
Age: 54
Education: B.Com. LLB
రాజకీయ అనుభవం: అనంతపురం జిల్లా వైకాపా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
Nani..Nani..Nani...
కొడాలి నాలుగోసారి..
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) నాలుగోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లోనే హ్యాట్రిక్ రికార్డు నమోదు చేసిన ఆయన నాలుగోసారి విజయం సాధించి తనకు తిరుగులేదనిపించుకున్నారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004, 2009లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన నాని తర్వాత వైకాపాలో చేరారు. 2014లో వైకాపా తరఫున గెలుపొందారు. తాజా ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేశారు. తెదేపాలో ఉన్నప్పుడు చురుకుగా వ్యవహరించేవారు. వైకాపాలో చేరిన తర్వాత దూకుడు పెంచారు.
ముచ్చటగా మూడోసారి ఆళ్ల
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆళ్లనాని వరుసగా మూడో సారి విజయం సాధించారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్ల నాని వరుసగా విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఆళ్ల నాని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆయన సమీప ప్రత్యర్ధి, తెదేపా అభ్యర్థి అయిన మరడాని రంగారావుపై 33,053 ఓట్ల మెజార్టీని సాధించారు. 2009 ఎన్నికల్లో ఆళ్ల సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం అభ్యర్థి బడేటి బుజ్జిపై 13,682 ఓట్ల మెజార్టీని సాధించారు. 2014లో నిర్వహించిన ఎన్నికల్లో ఆళ్ల నాని వైకాపా తరఫున పోటీ చేశారు. ఆయన సమీప ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి బడేటి బుజ్జిపై ఓటమి పాలవగా బడేటి బుజ్జికి ఆ ఎన్నికల్లో 24780 ఓట్ల మెజార్టీ లభించింది. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో ఆళ్ల నాని వైకాపా తరఫున పోటీచేసి గెలుపొందిన సంగతి విధితమే. ఈ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి బడేటి బుజ్జిపై ఆళ్ల నానికి కేవలం 4072 ఓట్లు మెజార్టీ మాత్రమే దక్కింది.
నువ్వా నేనా అన్నంతగా పేర్ని
కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వైకాపా అభ్యర్థి పేర్ని వెంకట రామయ్య ( నాని) సమీప ప్రత్యర్థి తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై 5,590 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో 15 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలైన పేర్ని నాని..తాజా ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు తనకు మరింత బలాన్నిస్తాయని ఆయన ప్రగాఢ నమ్మకంతో ఉండేవారు. తాజాగా అదే నిరూపితమైంది. సామాజికంగానూ ఆర్థికంగానూ ఇద్దరు ప్రత్యర్థూలు బలంగా ఉండడం, ఇద్దరూ వివాదాలకు దూరంగా ఉండడంతో పోటీ కూడా అదే స్థాయిలో జరిగింది. చివరకు పేర్ని వెంకట్రామయ్య మరోసారి విజయం సాధించారు. పేర్ని నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాలను పుణికి పుచ్చుకున్న ఆయన 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున బందరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 2013లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు.