Charitha Reddy Aella, who was working for a software firm was living at Lansing, Michigan and the accident took place around 9 p.m. on I-96 westbound near Mile Marker 10. “Four passengers were in the vehicle, including Aella. Officials said the other three passengers were recovering from their injuries,” reported a local news website, adding that speed and alcohol were factors in the crash.
According to reports reaching here, the victims were in a Toyota Camry that had pulled to the shoulder with its four-way flashers activated, while a Chrysler 300, driven by a Muskegon Heights man, 40, was travelling in the right lane before it crashed into the back of the Toyota. The Muskegon Heights man was not hurt.
It was said that Charitha was sitting in the rear passenger seat and took the impact of the accident. Her mortal remains will be brought to Hyderabad for last rites.
Meanwhile, the victim’s cousin Jayanthi Ganugupati, who started that online fund raising stated that Charitha was a sweet, happy-go and a beloved soul. “She is a confident and independent woman who always had a strong faith in herself that anything can be achieved with firm compassion and conviction,” her message on gofundme website stated.
Further, it said that Charitha showered selfless love for every individual and was ready to hear out other’s problems and gave immense support and strongly believed that togetherness is everything. “No words can express about the love she has for her family and friends alike. Can’t believe that she met with an accident and no more with us,” Ms. Ganugupati said.
Accident Details:
The crash happened around 8:50 PM., Friday (2019 December 27th) near Coopersville, Michigan in a 2008 Toyota Camry that had pulled to the shoulder with its four-way flashers activated. A Muskegon Heights man, 40, was traveling in the right lane and crashed into the back of the Toyota with his car. Passengers in Toyota-Charitha who was sitting in the rear passenger seat behind the driver was critically impacted and was taken to Mercy Health Hackley Campus in Muskegon. Charitha was unconscious and did not respond to the treatment and doctors have confirmed she is Brain dead and took her last breath on Sunday Afternoon (2019 December 28th).

ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన మరో కారు
ముందు కారులో ఉన్న ఎల్ల చరితారెడ్డి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువతి దుర్మరణం పాలైంది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.45 గంటలకు మిచిగాన్ వద్ద ఆగి ఉన్న కారును అతివేగంగా వచ్చిన మరో కారు వెనక నుంచి ఢీకొట్టడంతో ముందు కారులో ఉన్న ఎల్ల చరితారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నేరేడ్‌మెట్‌లోని రేణుకానగర్‌కు చెందిన ఇంద్రారెడ్డి, శోభ దంపతులకు కుమార్తె చరితారెడ్డి, కుమారుడు యశ్వంత్‌రెడ్డి ఉన్నారు.
8 నెలల క్రితం అమెరికాలోని డెలాయిట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో చరితారెడ్డి అక్కడకు వెళ్లారు. మిచిగాన్‌లో ఉంటున్న ఆమె.. వీకెండ్ కావడంతో శుక్రవారం ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లారు. మిచిగాన్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న వారి కారును వెనుక వైపు నుంచి మరో కారు ఢీకొట్టింది. కారు వెనుక సీటులో కూర్చున్న ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని అరెస్టు చేశారని మృతురాలి సోదరుడు తెలిపారు. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. ఈ విషయంలో మంత్రి ఈటల రాజేందర్ చొరవ తీసుకున్నారన్నారు. ప్రమాదం ముందురోజే తన సోదరి తమతో మాట్లాడిందని, హెచ్‌వన్ వీసా రాకపోతే హైదరాబాద్ వచ్చేస్తానని చెప్పిందని యశ్వంత్‌రెడ్డి కన్నీళ్ల పర్యంతమయ్యారు.
భయంలో ఉన్న వారికి ధైర్యం చెప్పాలి. కష్టాల్లో ఉన్న వారికి సాయం చెయ్యాలి. ఉపాధి లేని వారికి ఓ దారి చూపించాలి. ఇదీ.. చరితారెడ్డి ధ్యేయం.. లక్ష్యం.. గమ్యం. అయితే.. అవేవీ నెరవేరకుండానే.. కలల రెక్కలతో యూఎస్ వెళ్లిన చరిత.. కన్నీటి చెక్కపెట్టెలో ఇండియాకు చేరింది.
‘ప్రపంచమంతా తెలియాలనేది’
‘‘గూగుల్ సెర్చ్‌లో చరితారెడ్డి అని వెతికితే ప్రపంచమంతా తెలిసిపోవాలమ్మా. అంతటి ఉన్నత స్థాయికి చేరుకోవాలి’ అనేది చరిత. ఇప్పుడిలా అవయవదానంతో ప్రపంచమంతా తెలిసేలా నిలిచింది’’... దుఃఖాన్ని ఆపుకుంటూ కూతురి గురించి తల్లి శోభ చెప్పిన మొదటి మాట ఇది. చరిత ఆ ఇంటికి పెద్ద కూతురు. పాతికేళ్ల వయసు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఎదగాలనే కలలను రెక్కలుగా కట్టుకొని అమెరికా చేరుకుంది. కొన్నాళ్లు అక్కడే ఉద్యోగం చేసి, తర్వాత ఇండియా వచ్చి స్థిరపడాలని ఆమె ఆలోచన. కూతురికి ఘనంగా పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేయాలని ఆ తల్లిదండ్రులూ కలలు కన్నారు. ఇంతలోనే ఊహించని ఉత్పాతం.
‘‘కూతుళ్లకు అమ్మలు ఫ్రెండ్‌లా ఉండాలంటారు. కానీ, నా కూతురు తన చిన్నప్పటి నుంచీ నాకో మంచి ఫ్రెండ్‌లా ఉండేది. స్కూల్‌లో, కాలేజీలో జరిగిన విషయాలు, స్నేహితుల ముచ్చట్లు అన్నీ నాతో చెప్పేది. చాలా చురుకు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చెబితే.. ‘అమ్మా.. మార్కులు ఎక్కువ స్కోర్ చేయడం కాదు.. నాలెడ్జ్‌ని స్కోర్ చేయాలి’ అనేది. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. బిజినెస్ బుక్క్ ఎక్కువగా చదువుతుండేది. ఏ పని చేసినా తనకో ప్లానింగ్ ఉంటుంది. దేనికీ హడావిడి పడదు. మర్చిపోయాను అనే మాటే ఉండదు. చరిత చేతి రాత అందంగా ఉంటుంది. కానీ ఆ దేవుడు రాసిన రాతే...’’ అంటూ ఆగి, ‘‘మూడేళ్లయ్యింది చరిత అమెరికా వెళ్లి. ఇండియా వచ్చాక పదిమందికి ఉపాధి కల్పించాలని అనుకుంది..’’ అని చెప్పారు చరిత తల్లి.

‘మల్లారెడ్డిగారూ.. అనేది’
‘‘ఇప్పుడు నన్ను మల్లారెడ్డిగారూ.. అని పిలవడానికి నా మనవరాలు లేదు. కానీ, తను అలా పిలుస్తున్నట్టుగానే ఉంది’’ అంటూ చరితారెడ్డి తాత మల్లారెడ్డి మనవరాలిని తలుచుకున్నారు. ‘‘ఊహ తెలిసినప్పటి నుంచే నా మనవరాలు నన్ను తాతా అని కాకుండా మల్లారెడ్డి గారూ.. అని పిలిచేది. నాకూ అలాగే నచ్చేది. ఇంట్లో ఉన్నంత సేపు నాతో ఉండేది. రాత్రి భోజనం సమయంలో నేను తినే వరకు తను తినేది కాదు. మాట వరసకు ఎవరినైనా నేను ఏమైనా అంటే ‘ఎవరినీ ఏమి అనొద్దు మల్లారెడ్డిగారూ.. ఎవరి పరిస్థితులు ఎలాంటివో..’ అని ఆరిందాలా చెప్పేది.

అమెరికాకు వెళ్లిన తరువాత ఎప్పుడు ఫోన్ చేసినా ‘మల్లారెడ్డి గారూ ఎలా ఉన్నారు... ఆరోగ్యం ఎలా ఉంది’ అని ఆడిగాకే, మిగతా విషయాలు మాట్లాడేది. ప్రమాదానికి మూడు రోజుల ముందు నాకు చేతి గడియారం పంపించింది. (చేతికున్న వాచీని తడుముకుంటూ..). ఇంట్లోనే కాదు వీధులు కూడా శుభ్రంగా ఉండాలి తనకు. రోడ్ల మీద ఎక్కడైనా చిత్తు కాగితాలు కనిపిస్తే వాటిని తీసి చెత్త కుండీల్లో వేసి వచ్చేది. వీధిలో కుండీ కనిపించకపోతే వాటిని ఇంటికి తీసుకువచ్చి డస్ట్‌బిన్‌లో వేసేది. మా అమ్మనే మళ్లీ పుట్టింది అనిపించేది నాకు’’ అన్నారు మల్లారెడ్డి.
‘చరితకు చెప్తాం జాగ్రత్త!’ అనేవారు
‘మనం బాగున్నాం కదా నాన్నా. మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా బాగుండాలి. అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేస్తాను’ అని చిన్న వయసు నుంచే చరిత చెబుతుండేది. కాలేజీలో తోటి ఆడపిల్లల్ని ఎవరైనా అబ్బాయిలు ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే ధైర్యంగా వెళ్లి వారిని మందలించేది. ‘మమ్మల్ని ఏమైనా అంటే చరితతో చెబుతాం జాగ్రత్త’ అని తోటి విద్యార్థినులు కూడా ఆకతాయిలను బెదిరించేవారట. వాళ్లు కలిసినప్పుడు చరిత గురించి గొప్పగా చెప్పేవారు.
– చంద్రారెడ్డి, చరిత తండ్రి
– చంద్రారెడ్డి, చరిత తండ్రి
‘ఇండియాకు వచ్చాక బిజినెస్ చేద్దాం’ అంది
త్వరలోనే ఇండియాకు వస్తానని.. వచ్చిన తరువాత ఇద్దరం కలిసి మంచి బిజినెస్ చేద్దామని అక్క చెప్పింది. నాకు ఏ సబ్జెక్టులో డౌట్స్ ఉన్నా అక్కే తీర్చేది. అక్కకు గ్లాస్, చిన్నకుండీలపై డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. కాస్త టైమ్ దొరికినా పెయింటింగ్ చేసేది. చదువుతూ కూర్చుందంటే టైమ్ చూసుకునేది కాదు. తెల్లార్లూ కూర్చోనేది. కిందటి నెల 25న ఫ్రెండ్స్‌తో కలిసి బైక్ మీద లాంగ్‌డ్రైవ్‌కు బెంగళూరుకు వెళతానని అక్కతో చెబితే వద్దంది. అక్క చెప్పినట్టే లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లలేదు. ఎప్పుడూ నాకు జాగ్రత్తలు చెబుతూనే ఉండేది. – యశ్వంత్‌రెడ్డి, సోదరుడు
తొమ్మిది మంది చరితలు
అమెరికాలో కారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడే అవయవ (గుండె) దానానికి చరిత సంతకం చేసింది. రోడ్డు ప్రమాదం తరువాత గుండెతో పాటు ఇతర ఆర్గాన్స్ కూడా బాగున్నాయని అమెరికా వైద్యులు చెప్పారు. గుండె కవాటాలు (నలుగురికి), మూత్రపిండాలు (ఇద్దరికి), నేత్రాలు (ఇద్దరికి), కాలేయం (ఒకరికి) .. ఇలా చావుబతుకుల మధ్య ఉన్న తొమ్మిదికి అవయవదానం చేయడానికి అంగీకరించాం. మా కుటుంబంలో చరిత ఇప్పుడు ఆ తొమ్మిది మందిగా చేరిపోయింది.
1 Comment :
RIP
Post a Comment