fvz

Monday, July 20, 2020

Telugu language received recognition in Australia

Recently the Telugu language has got a rare distinction in Australia. According to the information received, the Government of Australia has given gifts to children studying in primary and secondary schools from first to 12th standard. Now children can choose Telugu language as an optional subject there. The Australian Government has given it permission. Along with this, it has also been said to give 5 marks more on the passing of students taking Telugu language as an elective subject.
This is a really great decision. Along with this, the Australian Government has also said that jobs and living forever can also apply on the basis of Telugu language, it has been decided to give additional 5 marks for the Telugu language to the candidates who participated in the examination conducted by the National Accreditation Authority for translators and interpreters. After knowing this news, Mallikeshwara Rao, the administrator, and media communication secretary of Telugu society has expressed happiness.
'This decision of the Government of Australia benefits the local Telugu people and the students coming to pursue higher education.' Till now the Telugu Associations in Australia were taught to Telugu children for programs like 'Man-Badi'. The decision that has been made will not be needed after that time you must have known that Hindi, Punjabi, and Tamil were recognized in Australia till now, but now the fourth language Telugu has been included.

స్కూళ్లలో ఆప్షనల్‌గా  తెలుగు భాష  
శాశ్వత నివాసానికి కూడా ప్రామాణికంగా తెలుగు
ఆమోదించిన ఆస్ట్రేలియా కేంద్ర ప్రభుత్వం
ఇది తెలుగు వారికి గర్వకారణమన్న అసోసియేషన్‌లు
విభిన్న సంస్కృతులకు, సాంప్రదాయాలకు నిలయమైన ఆస్ట్రేలియాలో మన తెలుగు భాషకు అరుదైన గౌరవం లభించింది. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు తెలుగు భాషను ఐచ్ఛిక అంశంగా ఎంపిక చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలుగు భాషకు పట్టం కట్టింది. అంతేకాకుండా  తెలుగు భాషను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకొన్న వారికి ఉత్తీర్ణతలో  5 పాయింట్‌లు  అదనంగా వస్తాయి. చదువులోనే కాకుండా అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్లు శాశ్వత నివాసం కోసం కూడా తెలుగు భాష ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్‌ అక్రిడిటేషన్‌ అథారిటీ ఫర్‌ ట్రాన్సిలేటర్స్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటర్స్‌ (నాటి) నిర్వహించే పరీక్ష రాసేవారికి కూడా తెలుగుకు 5 పాయింట్లు అదనంగా కలుస్తాయి.
ఇది శాశ్వత నివాసానికి ప్రామాణికం. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని వివిధ నగరాల్లో ఉన్న సుమారు లక్ష మందికి పైగా తెలుగు వాళ్లకే కాకుండా ఉన్నత చదువుల కోసం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం  తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్లేవాళ్లకు చక్కటి అవకాశమని ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య వ్యవస్థాపకులు, మీడియా, కమ్యూనికేషన్స్‌ విభాగం కార్యదర్శి మల్లికేశ్వర్‌రావు కొంచాడ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు  వివిధ నగరాల్లో ఉన్న తెలుగు అసోసియేషన్‌లు మన పిల్లలకు తెలుగును బోధించేందుకు  ప్రత్యేకంగా ‘మన బడి’వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుండగా, ఇక నుంచి ఆ అవసరం ఉండబోదన్నారు.  ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు హిందీ, పంజాబీ,తమిళ భాషలకు అక్కడి ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించగా, 4వ భాషగా  తెలుగు  ఆ   గౌరవాన్ని దక్కించుకోవడం విశేషం. దీంతో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్నీ, విక్టోరియా, న్యూసౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్,సౌత ఆస్ట్రేలియా, తదితర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికి ప్రయోజనం లభించనుంది. 
భావి తరాలకు బాటలు....
ఆస్ట్రేలియాలో  తెలుగు  భాషా వికాసం కోసం చాలాకాలంగా అనేక సాహిత్య, సాం స్కృతిక సంస్థలు కృషి చేçస్తూ భావి తరాలకు బాటలు వేస్తున్నాయి.‘తెలుగుమల్లి’ సాహిత్య మాసపత్రిక, ‘భువనవిజయం’ వంటి సాంస్కృతిక సంస్థలు ఈ క్రమంలో  తెలుగు ప్రజల అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచాయి. తెలుగు ప్రజల సాంస్కృతిక జీవితాన్ని, చరిత్రను దశదిశలా చాటేలా గత పదేళ్లుగా భువనవిజయం అనేక కార్యక్రమాలను నిర్వహించింది. మరోవైపు వివిధ నగరాల్లో పని చేసే తెలుగు అసోసియేషన్లు ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్యగా ఏర్పడి గత ఆరేడేళ్లుగా తెలుగు భాష గుర్తింపు కోసం అక్కడి కేంద్ర  ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి.  దీంతో విభిన్న సంస్కృతులకు నిలయమైన ఆస్ట్రేలియాలో మన తెలుగు సైతం మరో కలికితురాయిగా నిలిచింది.
2014లో దరఖాస్తు...
‘‘  తెలుగు సంఘాల ప్రతినిధులతో కలిసి  2014లోనే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు  అందజేశాం.కానీ అప్పటి జనాభా లెక్కల ప్రకారం మన సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీన్ని సవాల్‌గా తీసుకొని  విస్తృతంగా ప్రచారం చేపట్టాం. తెలుగు వాళ్లనందరినీ ఒక్కటి చేయగలిగాం.సుమారు లక్ష మందికి పైగా ఉన్నట్లు తేలింది. దీంతో తెలుగు భాషకు సమున్నతమైన గుర్తింపు లభించింది.ఇది తెలుగు వారికి ఒక పర్వదినం’’ అని మల్లికేశ్వర్‌రావు చెప్పారు. ఈ కృషిలో  డాక్టర్‌ కృష్ణ నడింపల్లి, శివ శంకర్‌ పెద్దిభొట్ల, వాణి మోటమర్రి తదితరులు కూడా ఉన్నారు. 

Wednesday, July 08, 2020

ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి

8 జూలై 1949 - 2 సెప్టెంబర్ 2009
'నేను ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు ధైర్యంగా మైకు పట్టుకుని 'ఈ గ్రామంలో ఇల్లు లేనివాళ్లు, నిజంగానే అర్హులై ఉండీ పెన్షన్‌ రానివాళ్లు, అర్హులైన వాళ్లలో ఏ ఒక్కరికైనా తెల్లకార్డు లేనివాళ్లు ఎవరైనా ఉంటే చేతులెత్తండి' అని అడగాలి. అలా అడిగినప్పుడు ఒక్క చెయ్యి కూడా లేవకూడదు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరినీ బాగుచేయాలి' దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కన్న గొప్ప కల ఇది. తాను ఎక్కడికెళ్లినా 'గోడు ఉండకూడదు, గూడు ఉండాలి' అని కోరుకున్న మహానేత.
చెదరిపోని గుండె బలం... నాయకత్వానికి నిలువెత్తు రూపం.. మేరునగ ధీరుడు మన వైయస్ రాజశేఖరుడు... ఆ పాదం అడుగిడిన నేలంతా అయ్యింది సస్యశ్యామలం.. మాట తప్పని ఆయన తీరు పేదల జీవితాల్లో వెలుగులు నింపగా మడమతిప్పని ఆయన నైజం ప్రత్యర్థులకు సింహస్వప్నం అయ్యింది. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

ప్రజల గుండెల్లో పదిలంగా..

తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వైఎస్సార్‌ పూర్తి పేరు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. 1949 జూలై 8 న వైఎస్‌ఆర్‌ జిల్లా, జమ్మలమడుగులో జన్మించారు. తల్లిదండ్రులు జయమ్మ, రాజా రెడ్డి. పాఠశాల విద్యాభ్యాసం బళ్లారిలో సాగగా, తర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో విద్యనభ్యసించారు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు.
అనంతరం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్‌ సర్జన్‌గా పట్టా పొందారు. వైద్య విద్య పూర్తైన తర్వాత కొంతకాలం జమ్మలమడుగులో వైద్యాధికారిగా పనిచేశారు. అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో కట్టించిన ఆస్పత్రిలో పనిచేశారు. వైఎస్సార్‌ సతీమణి విజయమ్మ. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. జగన్ మోహన్‌ రెడ్డి (కుమారుడు), షర్మిల (కుమార్తె).

వైఎస్సార్‌ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపించేవారు. గుల్బర్గాలో ఎం.ఆర్‌.మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నప్పుడే స్టూడెంట్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కాలేజ్‌లోనూ హౌస్‌ సర్జన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఇదే సమయంలో వైఎస్సార్‌ కుటుంబం కళాశాల నిర్మాణం, ఆసుపత్రి ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాల్ని కొనసాగించింది. ఇటు వైఎస్సార్‌ కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండడంతో, 1975లో ఆంధ్రప్రదేశ్‌ యువజన కార్యదర్శిగా నియమితులయ్యారు. అనంతరం 1978 ఎన్నికల్లో ఎమ్మేల్యేగా పోటీ చేశారు. అలా ఆయన రాజకీయ జీవితంలో కీలక దశ మొదలైంది.
1978లో జరిగిన ఎన్నికల్లో వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి తొలిసారిగా కడప జిల్లా పులివెందుల నియోజక వర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1983, 85లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మేల్యేగా గెలిచి, హ్యాట్రిక్‌ సాధించారు. ఆ తర్వాత 1989లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 1991, 96, 98లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారు.
వరుసగా నాలుగు సార్లు పార్లమెంటు స్థానానికి పోటీ చేసి అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించిన ఆయన 1999లో పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా గెలిచారు. తాను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి ఎరుగకుండా విజయం సాధించి, అరుదైన ఘనతను దక్కించుకున్నారు.
రాజకీయ నేతగా ఎదగాలనుకునే ఎవరికైనా ప్రజా సమస్యలపై అవగాహన ఉండాలి. ప్రజల్లోంచి వచ్చిన నేతలకు మాత్రమే వారి కష్టాల గురించి తెలుస్తుంది. వైఎస్సార్‌ ప్రజల్లోంచి వచ్చిన నేత. ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలతో ఉండేందుకే ప్రయత్నించారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా ఉన్న 2003-04 సమయంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీనిలో భాగంగా రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టారు.
2003 వేసవిలో పాదయాత్ర చేపట్టి, దాదాపు 1,467 కిలోమీటర్లు పర్యటించారు. ఈ యాత్రలో ప్రతి చోటా ప్రజలతో మమేకమవుతూ, వారి కష్టాల్ని తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల్ని కలిసి వారి ఇబ్బందుల్ని కళ్లారా చూసి, చలించి పోయారు. ముఖ్యంగా రైతు సమస్యల మీద ఆయనకు పూర్తి అవగాహన కలిగింది. పర్యటన ముగిసేలోపు ప్రజల సమస్యలు, పరిష్కారాలపై ఆయనకు పూర్తి అవగాహన వచ్చింది. ఈ యాత్రలో ప్రజలు, అభిమానుల నుంచి వైఎస్సార్‌కు ప్రతి చోటా మద్దతు లభించింది. ప్రజలు కూడా ఆయనలోని నిజాయతీని అర్థం చేసుకుని, తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించారు.
వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడే వారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో వైఎస్సార్‌ ముందుంటారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నించారు. ఎప్పుడూ తెలుగు వారి సంప్రదాయమైన పంచెకట్టులోనే కనిపించేవారు. పంచెకట్టుకి ఆయన గుర్తింపు తీసుకొచ్చారు. ఇక వివిధ సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులు ఎదురైనప్పుడు నవ్వుతూ పలకరించేవారు.
ఆయన నడవడిక, మాటల్లోనూ హుందాతనం ఉండేది. నిత్యం నవ్వుతూనే కనిపించేవారు. ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఆయన 2009 సెప్టెంబర్‌ 2న జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన భౌతికంగా దూరమైనా.. తెలుగు ప్రజల గుండెల్లో మాత్రం ఎప్పటికీ జీవించే ఉంటారు. ప్రజల జ్ఞాపకాల్లో ఆయన ఎప్పుడూ పదిలంగానే ఉంటారు.
వైఎస్సార్‌ 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే కీలక రంగాలపై దృష్టి సారించారు. ప్రధానంగా రైతులకు లబ్ధి చేకూర్చేలా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు, పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే ఉచిత్‌ విద్యుత్‌ ఫైలుపై సంతకం చేశారు. అనంతరం ఎన్నో కీలక పథకాల్ని ప్రవేశపెట్టారు.
రైతుల జీవితాల్లో వెలుగు నింపేందుకు తొలిసారిగా ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రారంభించారు. పేద రోగులు సరైన ఆర్థిక స్తోమత లేని కారణంగా తగిన వైద్య చికిత్స పొందలేకపోయేవారు. అయితే ప్రతి పేదవాడికి కార్పొరేట్‌ ఆసుపత్రిలో సరైన వైద్యం అందాలని వైఎస్సార్‌ భావించారు. ఇందుకోసం ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అనారోగ్యంతో ఉన్నవారికి, వివిధ ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ వైద్యం అందేందుకు 108 అంబులెన్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిరుపేదలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేశారు.
రైతులు బావుండాలంటే పంటలు పండాలి. ప్రతి పంటకూ నీరు అందాలంటే ప్రాజెక్టులు కట్టాలి. ఈ విషయాన్ని గుర్తించిన ఆయన జలయజ్ఞాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా వివిధ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు.
రేషన్‌ షాపుల్లో రెండు రూపాయలకే కిలో బియ్యంతోపాటు, ఇతర నిత్యావసరాల్ని కూడా తక్కువ ధరకే అందించారు. వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందించారు. ఇళ్లు లేని పేదల కోసం ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టారు.

Naalo.. Naatho...YSR - A Telugu book written by YS Vijayamma Garu


AP CM YS Jagan Launched Nalo Natho YSR Book  on Wednesday 08 July 2020 at Idupulapaya
‘బయటి ప్రపంచానికి నాన్న గొప్ప నాయకుడిగా అందరికీ పరిచయం. అమ్మ ఆయనలో ఉన్న మంచి వ్యక్తిని, వక్తను, తన సుదీర్ఘ ప్రయాణంలో నాన్నను చూసిన విధానాన్ని పుక్తకరూపంలో తీసుకొచ్చింది. ఇది ఒక మంచి పుస్తకం’ - ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

‘ఆయనలో చూసిన గొప్పగుణం. 37 ఏళ్ల సాహచర్యంలో ఆయన గురించి నేను తెలుసుకున్న విషయాల గురించి రాయాలనిపించింది. ఆయనలోని మూర్తిభవించిన మానవత్వం​, ఆయన మాటకిచ్చే విలువ నలుగురికి తెలియజెప్పాలనిపించింది. ఆయన ఎంతో మంది జీవితాలకు వెలుగునిచ్చారు. ఎంతో మంది అది మాకిచ్చిన భాగ్యం అనుకుంటా. ప్రతిఒక్కరూ ఆయన జీవితం తెలుసుకోవాలని కోరుకుంటున్నా. నా బిడ్డల మాదిరిగా ఆయన ప్రతి మాట, వేసిన ప్రతి అడుగు తెలుసుకుని ఆచరణలో పెట్టాలని కోరుకుంటున్నా. సహృదయంతో ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాలని కోరుకుంటున్నా’ - విజయమ్మ

మహా నేత ప్రతి అడుగు వెనక ఉన్న ఆలోచనలు..  

అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలపై విశ్లేషణ

ప్రతి ఒక్కరి ప్రగతి.. ఇంటింటా అందరికీ మేలు  

అందుకే ఆయనను ఇప్పటికీ ఆరాధిస్తున్నారు..

విజయమ్మ మనోగతం.. భావోద్వేగాల సమాహారం 

మహానేత వేసిన ప్రతి అడుగు వెనకా ఉన్న ఆలోచనను, అనుభవాల నుంచి ఆయన నేర్చుకున్న పాఠాలను ఈ పుస్తకంలో విశ్లేషించారు.

ఆయన, ఇంట గెలిచి రచ్చ గెలిచిన తీరును; ఇంట్లో వారి అవసరాలను అర్థం చేసుకున్నట్టే ప్రజలనూ కుటుంబ సభ్యులుగా భావించి వారి అవసరాలను అర్థం చేసుకున్న విధానాన్ని వివరించారు. 

 కుటుంబ సభ్యుల ప్రగతిని కోరినట్టే రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రగతినీ కోరుకుని, ఇంటింటా అందరికీ మేలు చేయబట్టే తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే రాష్ట్ర ప్రజలంతా ఆయనను ఇప్పటికీ ఆరాధిస్తున్నారు. 

 వైఎస్‌ తన జీవితమంతా పంచిన మంచితనమనే సంపద తన పిల్లలూ మనవలకే కాకుండా..ఇంటింటా పెరగాలనే సంకల్పంతోనే ఈ పుస్తకాన్ని సవినయంగా సమాజం ముందుంచుతున్నా. 

 ఆయన్ను ప్రేమించిన తెలుగు ప్రజలందరికీ ఈ పుస్త కాన్ని అంకితం చేస్తున్నానని విజయమ్మ అన్నారు.  

 తమ వివాహం, ఆ నాటి పరిస్థితులు, పేదల వైద్యుడిగా వైఎస్సార్, రాజకీయాల్లో ఆయన రంగ ప్రవేశం, చిన్ననాటి నుంచి ఆయన నాయకత్వ లక్షణాలు, పేదల పట్ల కరుణ, రాజకీయాల్లో ఆటుపోట్లు, కుటుంబంలో ఆత్మీయతలు, పిల్లల చదువులు, వివాహాలు, దైవం పట్ల భక్తి శ్రద్ధలు, పీసీసీ అధ్యక్షుడిగా మొదలు ముఖ్యమంత్రి వరకు ఎదురైన ఒత్తిడులు, ప్రజా ప్రస్థానం, వైఎస్‌ జగన్‌; షర్మిలలతో.. వారి కుటుంబాలతో మహానేత అనుబంధాలు; మహానేత మరణంతో ఎదురైన పెను సవాళ్లు, వైఎస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణం చేసేవరకు పరిణామాలు.. ఇవన్నీ ఈ పుస్తకంలో రేఖామాత్రంగా కొన్ని, వివరంగా మరికొన్నింటిని వివరించారు.  

 తాను మరణించినా తన పథకాల్లో ఎప్పటికీ జీవించి ఉన్న, ప్రజలంతా తన కుటుంబమే అనుకున్న మహానేత గురించి రాబోయే తరాలకు కూడా స్ఫూర్తి ఇవ్వాల న్న సత్సంకల్పంతో ఈ పుస్తకాన్ని ప్రజలముందుంచుతున్నానని అన్నారు. ఆయన జీవితమే తెరిచిన పుస్తకమని, ప్రజాప్రస్థానంలో ప్రతి అడుగూ ప్రజల జీవితంతోనే ముడిపడి ఉందని విజయమ్మ వివరించారు.   

వైఎస్‌ సహధర్మచారిణిగా విజయమ్మ 37 ఏళ్ల జీవితసారం ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న అనూహ్యంగా వైఎస్‌ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ పుస్తకం. ‘మహానేత గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజల నుంచి తెలుసుకున్నానని, ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చాను’అని విజయమ్మ తన తొలి పలుకుల్లో చెప్పారు. వైఎస్‌ ఒక తండ్రిగా, భర్తగా, ఎలా ఉండేవారో ఈ పుస్తకం ఆవిష్కరించింది. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా... నిజ జీవితంలో వైఎస్సార్‌ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండే వారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో విజయమ్మ వివరించారు. 

Wednesday, July 01, 2020

All set for launch of New 108 and 104 Emergency Ambulance Services in Andhra Pradesh on 01 July 2020





The Andhra Pradesh government that has approved 108 and 104 ambulance vehicles to provide essential medical services to the people of the state in an emergency is now going to launch new vehicles. As many as 1,060 vehicles with state-of-the-art amenities are expected to hit the road starting from July 1. Chief Minister YS Jagan Mohan Reddy would launch the new vehicles at Vijayawada Benz Circle.

Jagan's decision to extend medical services to every remote village in the state has bought the new ambulances. The government also hired drivers and staff for 108 and 104 services. With this, new ambulances will be launched in the state from July 1st. These services will be useful in these unprecedented times of Coronavirus outbreak. Meanwhile, the number of coronavirus positive cases is increasing in Andhra Pradesh. A total of 793 positive cases were reported today, according to the state health ministry's health bulletin. Of these, 706 cases were reported from the state while 87 were from other states and abroad. With this, the total number of cases in the state reached 13,891 including 7,479 active cases and 6,232 recovered cases from. While the total number of corona deaths reached 180.


  • 1,088 అంబులెన్స్‌లకు జెండా ఊపనున్న సీఎం వైఎస్‌ జగన్‌ 
  • ఆపదలో ఆదుకునే 108,104లకు ఆధునిక హంగులు 
  • తుప్పుపట్టిన, మూలనపడ్డ వాటి స్థానంలో సరికొత్త వాహనాలు 
  • ప్రతి మండలంలో ఒక 108, ఒక 104 అంబులెన్స్‌ సర్వీస్‌  
  • 108లో వెంటిలేటర్లు, సిరంజి పంప్స్‌లతో అధునాతన సౌకర్యాలు 
  • చిన్నారుల కోసం 26 నియోనేటల్‌ అంబులెన్స్‌లు  
  • రోగులు, శిశువుల మరణాలు తగ్గించడమే ప్రభుత్వ ధ్యేయం 
  • 108, 104 సర్వీసుల గతి మార్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 
  • నేడు విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద ఉదయం 9:35 గంటలకు ప్రారంభం 
108 సర్వీసుల్లో మార్పులు 
అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారిని వెంటనే ఆదుకునే 108 సర్వీసులో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. కొత్తగా 412 అంబులెన్స్‌లను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్స్‌లను కూడా వినియోగించనున్నారు. 
కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్స్‌లలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్‌ఎస్‌)గా తీర్చిదిద్దారు.  
మరో 26 అంబులెన్స్‌లను చిన్నారులకు (నియో నేటల్‌) వైద్య సేవలందించేలా తయారు చేశారు.
   
ఎన్నో సదుపాయాలు 
బీఎల్‌ఎస్‌ అంబులెన్స్‌లలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ ఛైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఏఎల్‌ఎస్‌ అంబులెన్స్‌లలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు అమర్చారు. నియో నేటల్‌ అంబులెన్స్‌లలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను అమర్చారు.  
ఎంఎంయూ(104)ల్లో సదుపాయాలు 
ప్రతి మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ)లో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)తో అనుసంధానమై పని చేసే ఎంఎంయూలు, ఇక నుంచి మారుమూల కుగ్రామాలలో సైతం శరవేగంగా వైద్య సేవలందించనున్నాయి. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన ఔషధాలను ఉచితంగా అందజేస్తారు. 
ప్రతి ఎంఎంయూలో ఆటోమేటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌ (ఏవీఎల్‌టీ)తో పాటు, గ్లోబల్‌ పొజిషనింగ్‌ విధానం (జీపీఎస్‌) కూడా ఉంటుంది.  
ఆధార్‌ కోసం బయోమెట్రిక్‌ ఉపకరణాలు, రోగుల డేటాను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయడం కోసం ట్యాబ్, పర్సనల్‌ కంప్యూటర్‌ (పీసీ) కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. తద్వారా రోగుల ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డు తయారు చేయడం  సులువు అవుతుంది.  
వేగంగా సేవలు 
పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్స్‌లు చేరే విధంగా ఆ స్థాయిలో సర్వీసులను ప్రారంభిస్తున్నారు. 
ప్రతి అంబులెన్స్‌ను ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ (ఈఆర్‌సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్‌ చేసిన వారిని వేగంగా ట్రాక్‌ చేసే వీలు కలుగుతుంది.  
ప్రతి అంబులెన్స్‌లో ఒక కెమెరా, ఒక మొబైల్‌ డేటా టెర్మినల్‌ (ఎండీటీ), మొబైల్‌ ఫోన్‌తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌ (ఏవీఎల్‌టీ) బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.    
ఎంఎంయూల్లో 20 రకాల సేవలు 
మాతా శిశు మరణాలు నివారించడంతో పాటు, చిన్నారుల ఆరోగ్యం కాపాడడం, వారిలో పౌష్టికాహార లోపం లేకుండా చూడడం, ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని సీజన్లలో ప్రబలే అంటువ్యాధులు నివారించడం, కుగ్రామాలలో నివసించే వారికి కూడా అత్యాధునిక వైద్య సదుపాయం కల్పిస్తూ మొత్తం 20 రకాల సేవలందించేలా 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేస్తూ ప్రభుత్వం ఎంఎంయూలను తీర్చిదిద్దింది.  
అన్నీ కలిపి ఒకేసారి మొత్తం 1,088 వాహనాలను సీఎం జగన్‌ బుధవారం ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.203 కోట్లు ఖర్చు చేసింది. కొత్త, పాత అంబులెన్స్‌లతో పాటు, మొత్తం ఎంఎంయూల నిర్వహణకు ఏటా రూ.318.93 కోట్లు ఖర్చు కానుంది. 
104 సర్వీసుల్లో మార్పులు.. కొత్తగా 676 వాహనాలు 
మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక 104 సర్వీసు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి 676 సర్వీసులను సిద్ధం చేశారు.  
గతానికి ఇప్పటికీ మార్పు 
రాష్ట్రంలో గతంలో 108 అంబులెన్స్‌లు 440కి గాను  ప్రతి మండలం (676 మండలాలు)తో పాటు, పట్టణ ప్రాంతాల్లోనూ సేవలందించనున్నాయి.  
మండలానికి ఒకటి చొప్పున ఉండే 104 వాహనాలు నెలలో ఒక రోజు ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజలకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులను ఇవ్వనున్నాయి. 
రోజుకు ఒక గ్రామ సచివాలయాన్ని సందర్శించడంతో పాటు రోజంతా ఆ గ్రామంలో డాక్టర్లు ఉంటారు. గ్రామంలోని ఇళ్లను, అంగన్‌వాడీ కేంద్రాలను, పాఠశాలలను కూడా సందర్శించి వైద్య సేవలు అందిస్తారు. 
గ్రామీణ ప్రాంతాల్లో ఒకే డాక్టర్‌ ద్వారా వైద్య సేవలు కల్పించడం ద్వారా విదేశాల తరహాలో ఫ్యామిలీ డాక్టర్‌గా మంచి సేవలు అందించడానికి వీలుంటుంది.  
గతంలో 104 అంబులెన్స్‌లు (ఎంఎంయూ) 292 మాత్రమే (మూడు మండలాలకు ఒకటి) ఉండగా, ఇప్పుడు మండలానికి ఒకటి చొప్పున మొత్తం 676 సర్వీసులు పని చేయనున్నాయి. 20 రకాల వైద్య సేవలతో పాటు 74 రకాల ఔషధాలు అందుబాటులో ఉంటాయి. గతంలో 52 ఔషధాలు మాత్రమే ఉండేవి. 
ఇప్పుడు హైపర్‌ టెన్షన్‌ (బీపీ), మధుమేహం (సుగర్‌), సాధారణ అవుట్‌ పేషంట్లకు చికిత్స అందించడంతో పాటు మలేరియా, టీబీ, లెప్రసీ, మాతా శిశు సంరక్షణ, తదితర 20 రకాల వైద్య సేవలకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయి.   
సీజనల్‌ వ్యాధులతో సహా 29 పరికరాలతో అంటువ్యాధులు, ఇతర వ్యాధుల స్క్రీనింగ్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. గతంలో ఈ అంబులెన్స్‌లలో కేవలం వైద్యులు మాత్రమే అతి కష్టం మీద అందుబాటులో ఉండేవారు.  
ప్రస్తుతం 104 సర్వీసుల్లో మొత్తం 744 మంది వైద్యులు సేవలందించనున్నారు. వీటిని డాక్టర్‌ వైఎస్సార్‌ టెలీ మెడిసిన్, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసి నిర్వహించనున్నారు. తద్వారా అన్ని ప్రాంతాల్లో సమర్థవంతంగా వైద్య సేవలు అందనున్నాయి. 
గతంలో 292 వాహనాలతో రోజుకు కేవలం 20 వేల మంది రోగులకు సేవలందించగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 676 సర్వీసుల ద్వారా రోజూ 40,560 మందికి సేవలందుతాయి.   
జనాభా–అంబులెన్స్‌ల నిష్పత్తి 
గతంలో సగటున ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్స్‌ ఉండేది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు మిన్నగా  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు దగ్గరగా ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్స్‌ అందుబాటులో ఉండనుంది. 
గతంలో సంవత్సరానికి 6,33,600 కేసుల్లో సేవలందించగా ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో ఏడాదికి 12 లక్షల మందికి సేవలందించేలా తీర్చిదిద్దారు.  
డాక్టర్‌ వైఎస్సార్‌ రహదారి భద్రతకు 108 సర్వీస్‌ లింక్‌ 
108 అంబులెన్స్‌ సర్వీసులకు కొత్తగా ప్రారంభిస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ రహదారి భద్రత కార్యక్రమాన్ని లింక్‌ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి దీని ద్వారా ఆస్పత్రులలో ఉచితంగా వైద్య సేవలందిస్తారు.  
రెండు రోజుల పాటు లేదా గరిష్టంగా రూ.50 వేల వ్యయం వరకు వైద్య సేవలందిస్తారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టు ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.  

Thursday, June 25, 2020

YSR KAPU NESTHAM Scheme Launched by AP CM YS Jagan Mohan Reddy @ Tadepalli on 24 June 2020

కాపులకు గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం చేసింది? గుండెల మీద చేయి వేసుకుని పాలనలో తేడా చూడండి. ఏటా రూ.1,000 కోట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఇచ్చింది కేవలం రూ.1,874 కోట్లు మాత్రమే. అంటే ఏటా రూ.400 కోట్లు కూడా ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.4,770 కోట్లు కాపు కులస్తులకు ఇచ్చింది.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌


  • ఈ 13 నెలల పాలన గొప్ప మార్పుతో సాగింది
  • రూ.15,000 చొప్పున 2.36 లక్షల మందికి రూ.354 కోట్లు జమ
  • పథకాల్లో ఎక్కడా వివక్ష, అవినీతికి తావివ్వలేదు.. మాకు ఓటు వేయకపోయినా అర్హత ఉంటే మంచి జరగాలని ఆరాటపడ్డాం
  • కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదు
  • అర్హుల జాబితాలో మీ పేరు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోండి
  • వచ్చే నెల ఇదే రోజున తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేస్తాం
  • 23 లక్షల మంది కాపులకు వివిధ పథకాల కింద రూ.4,770 కోట్ల లబ్ధి


Sunday, June 21, 2020

Tamil Hero Actor Vijay Fans Admiring Andhra CM Prince YS Jagan


18 Reasons Why Ghee is Good for Your Body


Called ghritam and sarpi in Sanskrit, ghee has not only been a part of the Vedic rituals but has also adored the Indian kitchen since ages. Sushruta, while elucidating the common qualities of ghee, has written that it is sweet in taste and is ‘saumya’ or cooling and mild in potency. It subdues the deranged vata and pitta. Ghee as a medicine has been used both externally and internally.
Actually classic ayurvedic literature , while telling many types of medicines to treat diseases, devotes special attention to ‘ghrit chikitsa’ – treatment with various preparations of ghee.

You must have seen people cutting Ghee (clarified butter) from their diet to maintain a fit and fabulous body. But do you know Ghee not only helps you improve your immunity but also aids digestion?
According to Ayurveda, Ghee is considered a satvic food. Satvic foods promote good health, positivity and personal growth and nothing better than Ghee.
Ghee has a host of health and cooking benefits and is good for the mind and spirit. Modern science has finally got around to proving the physical and mental health benefits of eating Ghee.
What Exactly is Ghee?
Also known as clarified butter, Ghee is formed when butter is boiled and the milk solids are removed, leaving a concentrated residue of pure fats. Like butter, it can be dangerous to your health if consumed in large quantities because of the high concentration of fat, but in small quantities it can do wonders.

Check Out the Health Benefits of Ghee:
Ghee Enables Weight Loss
Don’t be surprised. Like olive oil and coconut oil, Ghee contains healthy fats that can help you burn fat and lose weight.
Ghee Provides Energy
Ghee has a lipophilic effect on other fatty acids and fatty toxins. It gets absorbed by the liver and its simple structure makes it burn immediately. Most of us avoid eating Ghee today but it is one of the healthier sources of energy.
Ghee Reduces the Risk of Cancer, Heart Disease and Diabetes
Ghee is rich in conjugated linoleic acid (CLA), a fatty acid that protects against plaque, cancer and diabetes.

Ghee Lowers Cholesterol
Ghee is rich in omega-3 fatty acids, which lower cholesterol and boosts heart health.
Ghee is Nutritionally Rich Like Coconut Oil
One of the biggest benefits of ghee is its nutritional profile. It is rich in vitamins A and E, and ghee’s saturated fats are easier to break down than saturated fats. Despite some small differences, coconut oil and ghee are relatively similar, especially in terms of fat and calorie content.
Ghee Boosts digestion
Ghee is packed with butyric acid, a short chain fatty acid that has several benefits, one of which is better digestion. Our bodies actually convert fibre into butyric acid, so having Ghee makes the body’s job easier. Butyric acid helps heal the digestive tract and keeps it healthy.
Ghee Improves Immunity
The butyric acid in Ghee also promotes immunity by increasing the production of killer T cells.
Ghee Fights Inflammation
These days doctor suggest people to use butyrate supplements to treat inflammatory conditions. So why not use Ghee, it is a better option and is easily available.

Ghee Increases Appetite
Ghee triggers the release of gastric acid, which results in better digestion and increased appetite.
Ghee Promotes Flexibility
It’s no wonder that yogis cooked their food in Ghee; it lubricates the joints and connective tissues and promotes flexibility.
Ghee Improves Eye Health
Ghee is rich in Vitamin A, which prevents macular degeneration and cataract development.
Ghee Gives You Beautiful Babies
Loaded with Vitamin K2, it is believed that Ghee plays an important role in the development of the baby’s facial features and teeth.
Ghee Promotes Positivity
According to Ayurveda, Ghee is considered a satvic food. It promotes good health, positivity and personal growth. This is also one of the reasons elderly recommend using Ghee to light Puja lamps.

Ghee Removes Emotional Toxins
Research shows that negative emotions have a chemical composition, and that these chemicals get stored in unhealthy fats. Ghee is a healthy fat that does not harbour these emotions; instead it can be used to flush them out.
Absorbs the Nutrients in Herbs and Spices
Indian food contains several herbs and spices loaded with numerous nutrients. Ghee absorbs these nutrients better than oil and helps them reach the correct part of the body, where they are required the most.
Ghee Does Not Break Down into Free Radicals
Many oils have a low smoke point at which they break down and form free radicals. Free radicals are harmful agents that cause all sorts of disease and deterioration of the body, right from ageing to cancer. Ghee has a high smoke point (250 °C), so it doesn’t break down into free radicals while cooking.
Ghee Can be Stored Without Refrigeration
During the clarification process, the milk solid from Ghee is removed. Since only pure fat remains in Ghee, it can be stored without refrigeration for years without going bad.
Ghee Does Not Trigger Lactose Intolerance
Since the milk solids have been removed, Ghee usually doesn’t bother people who are lactose intolerant.

Saturday, June 20, 2020

APCARL || MoU Signed for Manufacturing Cattle Vaccine || ప్రపంచ స్థాయి పశువుల వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం దిశగా..


AP Centre for Advanced Research on Livestock CEO M. Srinivasa Rao and IGY Immunologix promoter Adinarayana Reddy exchanging copies of MoU on Friday 19 June 2020.

The Andhra Pradesh Centre for Advanced Research on Livestock (APCARL) and IGY Immunologix India Private Limited signed an MoU for manufacturing vaccines for cattle afflicted with various diseases. It is a Public-Private Partnership project targeted to be launched next year.

APCARL CEO M. Srinivasa Rao and IGY Immunologix promoter Adinarayana Reddy signed the pact in the presence of Chief Minister Y.S. Jagan Mohan Reddy and Special Chief Secretary (Animal Husbandry, Dairy Development and Fisheries) Poonam Malakondaiah at the CM camp office at Tadepalli.

According to an official release, the State government will create the necessary infrastructure and M/s IGY will invest about ₹50 crore in the joint venture, which is expected to provide employment to 100 veterinarians and other staff.

The government has plans to export the vaccines after meeting the local requirement and transform it into a vaccine manufacturer of international repute over a period of time.

ఏపీ కార్ల్‌లో పశువుల వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌

  • దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఐజీవై 
  • 100 మంది నిపుణులు, సిబ్బందికి ఉపాధి 
  • సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో అవగాహన ఒప్పందం

వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరంగాపురం సమీపంలో ఉన్న ఏపీ కార్ల్‌ (ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ అడావ్న్స్‌ రీసెర్చ్‌ ఆన్‌ లైవ్‌ స్టాక్‌)లో పశువులకు సంబంధించిన వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందంపై ఏపీ కార్ల్‌ సీఈఓ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు, ఐజీవై ఇమ్యునోలాజిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ డాక్టర్‌ ఆదినారాయణరెడ్డి మధ్య సంతకాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  

► రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పశువులకు అవసరమైన వ్యాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రం లేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నందున రాష్ట్రంలో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి కొన్నాళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
  
► ఈ నేపథ్యంలో పీపీపీ విధానంలో ఐజీవైతో పులివెందుల ఐజీ కార్ల్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రం కోసం ఒప్పందం కుదిరింది. తద్వారా 2021 నుంచి పశువులకు అవసరమైన అన్ని రకాల వ్యాక్సిన్ల తయారీ మొదలవుతుంది.

► గొర్రెలకు సహజంగా సోకే చిటెక రోగం, బొబ్బర్ల రోగం, పీపీఆర్, పశువుల్లో వచ్చే గొంతు వాపు, జబ్బ వాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా మొదలగు వ్యాధులకు అవసరమైన వ్యాక్సిన్లు తయారవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తుంది.

► ఈ ఒప్పందం ద్వారా ఐజీవై దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 100 మంది నిపుణులు, సిబ్బందికి ఉపాధి కలుగనుంది.

► మన రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంది. ప్రపంచ స్థాయి వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  

Tuesday, June 16, 2020

Andhra Pradesh 2020 - 2021 Budget Features || We have fulfilled 77 guarantees out of 129, another 39 guarantees are under consideration - AP Governor Biswabhushan Harichandan



  • ఏడాదిలో సంక్షేమ పథకాల కోసం రూ.42వేల కోట్లు ఖర్చు చేశాం.
  • వివిధ పథకాల కింద 3.98 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాం.
  • గత ఏడాదితో పోలిస్తే తలసరి ఆదాయం 12శాతం వృద్ధిగా నమోదయింది.
  • 129 హామీల్లో 77 హామీలు నెరవేర్చాము. మరో 39 హామీలు పరిశీలనలో ఉన్నాయి.
  • 1060 కొత్త 108, 104 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి.
  • నాడు-నేడు కింద ఆస్పత్రులను ఆధునీకరించేందుకు రూ.15337 కోట్లు కేటాయించాం.
  • వైఎస్సార్‌‌ రైతుభరోసా పథకం మొదటి దశ పూర్తయిందిరూ.12,500 ఇస్తామని చెప్పినప్పటికీ.. దీన్ని రూ.13,500లకు పెంచాం.
  • నాడు-నేడు మనబడి కార్యక్రమం కింద మూడేళ్లలో 48వేల పాఠశాలలను ఆధునికీకరిస్తాం
  • ఆరోగ్యశ్రీ పథకం కింద 6.25 లక్షల మందికి లబ్ధి చేకూరింది. దీని కోసం రూ.1534 కోట్లు ఖర్చు చేశాం.
  • విద్యార్థులకు పౌష్టికాహారం కోసం జగనన్న గోరుముద్ద పథకం. దీనికోసం 1105 కోట్లు ఖర్చు చేశాం
  • జగనన్న వసతి దీవెన కింద 18.51 లక్షల మందికి లబ్ధి. దీనికోసం 3857 కోట్లు ఖర్చు చేశాం.
  • వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద 1.06 లక్షల మందికి లబ్ధి. దీని కోసం రూ.72.82 కోట్లు ఖర్చుచేశాం.
  • వైఎస్సార్‌ కంటివెలుగు కింద 67.69 లక్షల మందికి లబ్ధి. దీని కోసం 53.85 కోట్లు ఖర్చు చేశాం.
  • గ్రామసచివాలయాల్లో 12వేల వైఎస్సార్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.
  • నాడు-నేడు కింద ఆస్పత్రులను ఆధునీకరించేందుకు రూ.15,337 కోట్లు కేటాయించాం.
  • మొదటి దశలో 49.44 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ రూ.10,209.32 కోట్లు ఖర్చు చేశాం.
  • కౌలురైతులకు కూడా ప్రయోజనం కల్పిస్తూ చర్యలు చేపట్టాం.
  • ప్రతి గ్రామసచివాలయంలోనూ రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం.
  • వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి నియోజకవర్గస్థాయిలో 147 వైఎస్సార్‌ వ్యవసాయ ప్రయోగశాలలను ఏర్పాటు చేశాం.
  • జిల్లాస్థాయిలో 13 ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేశాం.
  • పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, కరువు పరిస్థితులను అధిగమించేందుకు రూ.2వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  
  • రూ.7వేల కోట్లతో 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందిస్తున్నాం, మహిళల పేరిట ఈ స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం.
  • నాలుగేళ్లలో 25 లక్షల గృహాలను సమకూరుస్తాం.
  • 15 లక్షల ఇళ్లకు సంబంధించి ఆగస్టులో పనులు ప్రారంభమవుతాయి.
  • కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.
  • 11,158 గ్రామ సచివాలయాలు, 3876 వార్డు సచివాలయాలున్నాయి..
  • ఒక్కో గ్రామ, వార్డు సచివాలయం 2వేల మంది అవసరాలను తీరుస్తున్నాయి..
  • ఒక్కో సచివాలయంలో 10 మంది శాశ్వత సిబ్బంది, 40 మంది వాలంటీర్లు ఉన్నారు.
  • సున్నావడ్డీ పథకంతో 91 లక్షల మందికి ప్రయోజన చేకూరనుంది.
  • 45-60 మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా నాలుగేళ్లలో రూ.75వేల ఆర్ధికసాయం చేస్తున్నాం. 
  • రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళల సాధికారిత కోసం నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50శాతం రిజిర్వేషన్లు కల్పించాం.
  • 51,400 మంది ఉద్యోగులను ప్రజా రవాణా శాఖలోకి తీసుకుంటూ ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం.
ప్రాజెక్టుల గురించి..
  • జలయజ్ఞం కార్యక్రమం ద్వారా ఉద్దేశించిన 54 సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో 14 ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేశాం‌. 
  • మిగిలిన ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నాయి.
  • ఈ ఏడాది పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్‌, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, వంశధార రెండోదశ, వంశధార-నాగావళి అనుసంధానం, అవుకు రెండో సొరంగం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తాం.

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ది గురించి


  • విద్యుత్‌ బకాయిలకు సంబంధించి డిస్కంలకు రూ. 17904 కోట్లు కేటాయించాం.
  • ఏపీఐఐసీ ద్వారా 1466పైగా కంపెనీలకు భూములు కేటాయించాం.
  • దీని ద్వారా 36810 మందికి ఉద్యోగ అవకాశాలు, రూ.11548 కోట్ల పెట్టుబడులు వస్తాయి.
  • చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం వైఎస్‌ఆర్‌ నవోదయ పథకాన్ని ప్రారంభించాం.
  • భోగాపురం, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు పనులను వేగవంతం చేశాం.
  • జీఎంఆర్‌ సంస్థతో రూ.2,300 కోట్ల మేర భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం.
  • రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో మూడు కొత్త ఓడరేవుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం.
  • 3200 కోట్ల వ్యయంతో మూడేళ్లలో 8 చేపలు పట్టే ఓడరేవులను నిర్మిస్తాం.
రివర్స్‌ టెండరింగ్‌ గురించి..

  • ప్రభుత్వం స్వచ్ఛమైన మరియు అవినీతిరహితమైన పాలనకు కట్టుబడి ఉంది.
  • రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా సుమారు రూ.2,200 కోట్లు ఆదా చేశాం.
  • 100 కోట్లకుపైబడిన అన్ని టెండర్లను రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి ద్వారా పరిశీలించబడి కమిషన్‌ ద్వారా ఖరారు చేయబడుతుంది.
  • భూమి హక్కు గుర్తింపు చట్టం ద్వారా రిజిస్ట్రేషన్లలో అవకతవకలను భూ వివాదాలకు తావులేకుండా చేస్తున్నాం.
మూడు రాజధానులపై గవర్నర్

  • పరిపాలన వికేంద్రీకరణ అనేది కీలక అంశం
  • మూడు రాజధానులు ఏర్పాటు శాసన ప్రక్రియలో ఉంది 
  • శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది, ఆంగ్లమాధ్యమం గురించి

  • ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాం.
  • 97శాతం మంది తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకున్నారు.
  • ఇందులో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పడికీ త్వరలోనే తొలగిపోతాయి.
  • ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలను నియంత్రించడానికి చట్టం తీసుకొచ్చాం. జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ ఏర్పాటుచేశాం.
చారిత్రాత్మకమైన దిశ బిల్లును తీసుకొచ్చాం

  • మహిళలపై జరిగే నేరాలకు సత్వర విచారణ జరిపి 21 రోజుల్లో విచారణ జరిపేలా చట్టం
  • 18 దిశా పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేశాం
  • దిశ చట్టం అమలుక ప్రత్యేక న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేస్తాం
మద్యపాన నిషేధం దిశగా అడుగులు
  • దశల వారీ మద్యం నిషేధం అమల్లో భాగంగా 43వేల బెల్ట్‌షాపుల తొలగించాం. 4,300 పర్మిట్‌ రూమ్‌లను తొలగించాం.

కరోనా, లాక్‌డౌన్‌, వలసకూలీల గురించి ప్రభుత్వం తీసుకుంటున్న‌ చర్యలు 
  • కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంది.
  • కరోనా పరీక్షల నిర్వహణలో ఇతర రాష్ట్రాలకంటే ఏపీ ముందుంది.
  • రోజుకు దాదాపు 15వేల పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 5.5 లక్షల పరీక్షలు పూర్తి చేశాం.
  • రాష్ట్రంలో మరణాల రేటు.. జాతీయ సగటు కంటే చాలా తక్కువ.
  • రికవరీ రేటు.. జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది.
  • ప్రభుత్వం టెస్టింగ్‌ ల్యాబ్‌లను 1 నుంచి 13కు పెంచింది.
  • రాష్ట్రంలో 5 ప్రత్యేక కోవిడ్‌ ఆస్పత్రులున్నాయి.
  • కరోనా నివారణకు జిల్లాల్లో 65 ఆస్పత్రులు, 5,400 ఐసీయూ బెడ్స్‌, 38వేల ఐసోలేషన్‌ బెడ్స్‌, ఆక్సిజన్‌ సరఫరాతో 15వేల బెడ్స్‌ ఉన్నాయి.
  • లాక్‌డౌన్ సమయంలో రూ.వెయ్యి ఆర్ధిక సహాయంతో పాటు ఒక్కొక్కరికి 5కిలోల బియ్యం, కిలో పప్పు ఇచ్చాం.
  • వలసకూలీల సమస్యలను పరిష్కరించేందుకు 400 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి 1.2లక్షలకు పైగా వలస కూలీలకు ఆహారం వసతి అందించాం.
  • ఇతర రాష్ట్రాల్ల్లో చిక్కుకున్న 3.2లక్షల వలస కార్మికులను ఉచితంగా వారి గృహాలకు చేర్చాం, ఆర్టీసీ బస్సులు , శ్రామిక్ రైళ్ల ద్వారా వారిని సొంత గ్రామాలకు తరలించాం.
  • కరోనా సమయంలో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ద్వారా రూ.2,200 కోట్లతో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాం, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు చర్యలు తీసుకున్నాం, వాలంటీర్ల ద్వారా నాలుగు విడతలుగా ఇంటించి సర్వే చేయించాం.

జగన్ లాంటి సీఎంతో పనిచెయ్యడం నా అదృష్టం - గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్



 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top