The Andhra Pradesh government has released a scheme named AMMAVODI - One of the most ambitious schemes of AP Chief Minister YS Jagan Mohan Reddy.
This has been announced as a part of the NAVARATNALU welfare scheme. AMMAVODI scheme will be implemented from Thursday, 09 January 2020. The eligible candidates will receive financial assistance from Rs. 15,000 per year. The State government has allocated Rs. 6,455 crore for the AMMAVODI scheme.
Eligibility:
- The candidate who applies for the AMMAVODI scheme should have a White Ration card.
- Candidates should also have an Aadhaar Card.
- Students must have at least 75% attendance to receive the scheme benefits.
- If the students discontinues the studies, then he/she will not be eligible for the scheme. If the student wants to receive the scheme, then he/she has to return to the school to receive financial aid.
- Employees of Central and State Government, Employees of Public Sector Enterprises, Retired Employees of Central and State Government and Income Taxpayers who are receiving pensions are not eligible for AMMAVODI Scheme.
Where to check eligibility?
‘అమ్మఒడి’లోని చిన్నారులకు మేనమామ వరాలు
భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా చరిత్రాత్మక పథకం
పేదరికంతో నిమిత్తం లేకుండా ఉన్నత చదువులు
‘అమ్మఒడి’ ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్
మౌలిక వసతులతోపాటు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
అర్హులైన ప్రతి విద్యార్థి తల్లికి ఏటా రూ.15 వేలు
రూ.6,456 కోట్లు కేటాయింపు
దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు తద్వారా దాదాపుగా 82 లక్షల మంది పిల్లలకు లబ్ధి
అర్హులైనవారు ఇంకా ఉంటే ఫిబ్రవరి 9వ తేదీ లోపు నమోదు చేసుకోండి
వసతుల నిర్వహణలో అక్కచెల్లెమ్మలు భాగస్వాములు కావాలని పిల్లల మేనమామగా అభ్యర్థిస్తున్నా
పిల్లలు బాగా చదువుకునే వాతావరణం పాఠశాలల్లో ఉండాలి.. మంచి చదువులు చెప్పే ఉపాధ్యాయులు ఉండాలి.. చదువులు పేదింటి తల్లులకు భారం కాకూడదు.. పిల్లలకు కడుపు నింపే తిండి ఉండాలి.. ఈ నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ పథకం తీసుకొస్తున్నాం. పేదింటి పిల్లలు పోటీ ప్రపంచంలో దీటుగా నిలిచేలా తయారవ్వాలన్నదే మా లక్ష్యం.
అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరుతుంది. అర్హత ఉండి లబ్ధి చేకూరని తల్లులు ఎలాంటి హైరానా పడాల్సిన పనిలేదు. ఫిబ్రవరి 9వ తేదీలోపు.. అంటే నెల రోజుల్లోపు పేర్లు నమోదు చేసుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తాం. - ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
మధ్యాహ్న భోజనంలో మార్పులు
విద్యార్థులకు మంచి చదువుతోపాటు పౌష్టికాహారం కూడా ముఖ్యమే. మంచి ఆహారం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అందుకే మధ్యాహ్న భోజనం మెనూలో మార్పు తేవాలని సంకల్పించాం. పిల్లల భోజనం మెనూ విషయంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ఆలోచించి ఉండరు. మెనూ మార్పు ద్వారా దాదాపు రూ.200 కోట్లు అదనపు భారం పడుతుంది. భోజనం వండి పెట్టే ఆయాల జీతాలు వెయ్యి రూపాయల నుంచి రూ.3 వేలకు పెంచడం వల్ల రూ.160 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. అయినా పిల్లల కోసం ఆ ఖర్చును సంతోషంగా భరిస్తాం. సంక్రాంతి సెలవుల తర్వాత నుంచి కొత్త మెనూ అమలు చేస్తాం. ఆ మెనూ ఇలా ఉంటుంది.
సోమవారం : అన్నం, పప్పు చారు, ఎగ్ కర్రీ, స్వీట్ చిక్కీ
మంగళవారం : పులిహోర, టామాటా పప్పు, ఉడికించిన గుడ్డు
బుధవారం : వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ
గురువారం : కిచిడీ, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు
శుక్రవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ
శనివారం : అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్
|
తాము వండిన ఆహార పదార్థాలను సీఎంకు రుచి చూపిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు |
ఈ డబ్బును పాత అప్పులకు జమ చేసుకోరు
‘అమ్మఒడి పథకం ద్వారా చేకూరే లబ్ధి బ్యాంకర్లు మునపటి అప్పులకు జమ చేసుకోకూడదని సూచించాం. బ్యాంకర్లు సహకరించారు. ఈ పథకం కింద దాదాపు 42,12,186 లక్షల మంది తల్లులు, 81,72,224 లక్షల మంది పిల్లలకు మేలు చేకూరుతుంది. వీరికి రూ.6,456 కోట్లు చెల్లించనున్నాం. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు అమ్మఒడి ప్రవేశపెట్టనున్నట్లు పాదయాత్రలో చెప్పాను. ప్రస్తుతం ఇంటర్ వరకు వర్తింప చేస్తున్నాం. వరుసగా ప్రతి ఏటా తల్లుల అకౌంట్‌లో రూ.15 వేలు జమ అవుతుంది. చదువుకోవాలంటే ముందు కడుపు నిండాలని, తల్లులకు ఆర్థికంగా భరోసా ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ పథకంలో విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఏడాది మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉంటేనే పథకం వర్తిస్తుంది.