fvz

Monday, May 10, 2021

Anchor and actor TNR dies of COVID-19, May your Soul Rest in Peace 🙏


 తుమ్మల నరసింహారెడ్డి(టీఎన్‌ఆర్‌) దర్శకత్వంపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చారు. డిగ్రీ అయ్యాక సినిమాల మీద ఆసక్తి బాగా పెరిగింది. చిరంజీవి ఆయన అభిమాన నటుడు. చిరు సినిమాలు చూసి స్ఫూర్తి పొందేవారు. 1992లో దేవదాస్‌ కనకాల వద్ద దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నారు. స్నేహితుడి ద్వారా రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్‌ వద్ద సహాయకుడిగా పనిచేశారు. పలు చిత్రాలకు రచనలో సహకారం అందించారు. హాస్యనటుడు అలీ నటించిన పలు సినిమాలకు, చిరు నటించిన ‘హిట్లర్‌’ చిత్రానికి స్క్రిప్ట్‌లో పాలు పంచుకున్నారు. తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్నా, దర్శకుడిగా, రచయితగా సినిమాల వైపు రాకుండా బుల్లితెరకు వెళ్లారు. పలు న్యూస్‌ ఛానళ్లలో విలేకరిగా పనిచేశారు. 

ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ, ఉన్న‌త స్థాయికి ఎదుగుతాడ‌ని భావిస్తున్న టీఎన్ఆర్‌ను క‌రోనా అమాన వీయంగా బ‌లిగొంది. సినిమా ప్ర‌ముఖుల ఇంట‌ర్వ్యూల ద్వారా ఆయ‌న టాలీవుడ్‌లో గుర్తింపు పొందారు. అలాగే ఆయ‌న కొన్ని సినిమాల్లో కూడా న‌టించి మెప్పించారు.  జాతిర‌త్నాలు సినిమాలో కూడా ఆయ‌న న‌టించారు. ఈ సినిమాలో టీఎన్ఆర్ ఓ చాన‌ల్ యాంక‌ర్‌గా న‌టించ‌డం విశేషం. దాదాపు 15 సినిమాల్లో ఆయ‌న న‌టించిన‌ట్టు స‌మాచారం.

టీఎన్ఆర్ ఆశ‌ల‌ను, ఆకాంక్ష‌ల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి ఛిద్రం చేసింది. మొద‌ట ఆయ‌న భార్య క‌రోనా బారిన ప‌డ్డారు. ఆమె కోలుకున్న లోపే, టీఎన్ఆర్‌, వారి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా క‌రోనా బారిన ప‌డ్డారు.

పిల్ల‌లిద్ద‌రూ ఇంట్లోనే ఉంటూ కోలుకుంటున్నారు. ఊపిరి తీసుకోవ‌డం ఇబ్బందిగా ఉండ‌డంతో టీఎన్ఆర్ హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చేరారు. చివ‌రికి మృత్యువు అక్కున చేర్చుకుని కుటుంబ స‌భ్యుల‌కు, సినీ అభిమానుల‌కు శోకాన్ని మిగిల్చింది.

Monday, May 03, 2021

YSRCP Solid Success in Tirupati, Congrats to Dr. Gurumoorthy Maddela !


 

మారుమూల గ్రామం.. మధ్య తరగతి కుటుంబం


చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మారుమూల గ్రామం మన్నసముద్రం దళితవాడకు చెందిన మద్దెల గురుమూర్తిది సామాన్య కుటుంబం. తండ్రి మునికృష్ణయ్య రెండెకరాల ఆసామి. అది కూడా 1975లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిందే. ఈ భూమికి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పట్టా ఇచ్చారు. ప్రస్తుతం అందులో మామిడి సాగు చేస్తున్నారు. గురుమూర్తి తల్లి రమణమ్మ గృహిణి. ఆయనకు ఐదుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. ఐదో తరగతి వరకు మన్నసముద్రంలో, ఆరు నుంచి 10వ తరగతి వరకు పక్కనే ఉన్న బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో, ఆ తర్వాత ఇంటర్‌ తిరుపతిలో చదువుకున్నారు. అనంతరం స్విమ్స్‌లో ఫిజియోథెరఫీ పూర్తి చేశారు.

మహానేత స్ఫూర్తి.. జగనన్న వెన్నంటి..
గురుమూర్తి స్విమ్స్‌లో ఫిజియోథెరఫీ చేస్తున్న సమయంలో విద్యార్థి సంఘం నేతగా నాడు సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిని తరచూ కలిసేవారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేపట్టిన పాదయాత్రలో ఆయన వెంటే నడిచారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో తన వెంటే నడిచి ప్రజల కష్టాలు తెలుసుకున్న డాక్టర్‌ గురుమూర్తిని వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. డాక్టర్‌ గురుమూర్తి పేరును ప్రకటించిన రోజే ఆయన విజయం ఖరారైంది. ప్రజలపై ముఖ్యమంత్రి ఉంచిన నమ్మకాన్ని ఉప ఎన్నిక ఫలితం ద్వారా మరోసారి నిరూపించారు. 

డిక్లరేషన్‌ అందుకున్న గురుమూర్తి..
ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన డాక్టర్‌ ఎం.గురుమూర్తికి ఆదివారం రాత్రి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేవిఎన్‌ చక్రధర్‌బాబు డిక్లరేషన్‌ అందజేశారు. గురుమూర్తితో పాటు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్‌కుమార్‌యాదవ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గురుమూర్తి నెల్లూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. 


56.67 శాతం ఓట్లతో విజయభేరీ..

తిరుపతి ఉప ఎన్నికలో పోలైన మొత్తం 11,04,927 ఓట్లలో అధికార పార్టీకి సగానికిపైగా 56.67 శాతం ఓట్లు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.76 శాతం పోలింగ్‌ నమోదు కాగా 55.03 శాతం ఓట్లతో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఇప్పుడు కరోనా పరిస్థితుల కారణంగా పోలింగ్‌ శాతం తగ్గినా గత ఎన్నికల కంటే 1.64 శాతం ఓట్లను అధికంగా వైఎస్సార్‌సీపీ సాధించడం గమనార్హం. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ స్వయంగా ప్రచార రంగంలోకి దిగి ఇంటింటికీ తిరిగినా 2019 ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి 5.57 శాతం ఓట్లు తగ్గిపోవడం గమనార్హం. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. జనసేన జతకట్టడంతో బీజేపీ 5.2 శాతం ఓట్లతో ఎట్టకేలకు ‘నోటా’ను అధిగమించింది. కాంగ్రెస్‌ 1.78 శాతం ఓట్లను కోల్పోగా సీపీఎం 0.5 శాతం ఓట్లకే పరిమితమైంది.


‘ఫ్యాన్‌’ హ్యాట్రిక్‌


తిరుపతిలో ముచ్చటగా మూడోసారి ఘన విజయం

1989 నుంచి ఇదే భారీ మెజారిటీ

2019 కన్నా వైఎస్సార్‌ సీపీకి పెరిగిన మెజారిటీ శాతం

అప్పుడు 15.38... ఇప్పుడు 24.59 శాతం

అభ్యర్థి మారకున్నా దిగజారిన టీడీపీ పరిస్థితి 


వరుసగా మూడుసార్లు నెగ్గి తిరుపతి పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ హ్యాట్రిక్‌ సాధించింది. 2014 నుంచి తాజా ఎన్నికల వరకు పార్టీ అభ్యర్థులే ఇక్కడ విజయం సాధించడం గమనార్హం. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్‌ శాతం తగ్గినా భారీ మెజారిటీని కైవసం చేసుకుంది. అప్పుడు 13,16,473 (79.76 శాతం) ఓట్లు పోల్‌ కాగా తాజా ఉప ఎన్నికలో 11,04,927 (64.42 శాతం) పోలయ్యాయి. అంటే ఈసారి 2,11,546 (15.34 శాతం తక్కువ) ఓట్లు తక్కువగా పోలయ్యాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఎంపీగా గెలిచిన బల్లి దుర్గా ప్రసాద్‌ 55.03 శాతం ఓట్లతో 2,28,376 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇప్పుడు డాక్టర్‌ ఎం.గురుమూర్తి 56.67 శాతం ఓట్లతో 2,71,592 ఓట్ల మెజార్టీ సాధించారు. 2019లో పోలైన ఓట్లలో వైఎస్సార్‌సీపీ మెజార్టీ శాతం 15.38 అయితే ఇప్పుడు మెజార్టీ శాతం 24.59 కావడం గమనార్హం. అంటే 23 నెలల్లోనే జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మెజారిటీ 9.21 శాతం పెరిగింది.

ఇదే అత్యధికం
తిరుపతిలో 1989 సాధారణ ఎన్నికల దగ్గర్నుంచి పరిశీలిస్తే ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి గురుమూర్తి సాధించిన మెజారిటీనే అత్యధికమని స్పష్టమవుతోంది.



ఈ ఘన విజయం అందరిదీ
నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు

 23 నెలల పాలన తరవాత తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు మన ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా ఆశీర్వదించారు. ఈ ఘన విజయం ప్రజలందరిదీ. నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు. తిరుపతి పార్లమెంటు ఓటర్లు 2019 ఎన్నికల్లో 2.28 లక్షల మెజారిటీతో దీవిస్తే.. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మనసారా దీవించి.. నన్ను, మన ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ..  ఈ రోజు 2.71 లక్షల మెజారిటీ ఇవ్వటం ద్వారా చూపించిన అభిమానం, గౌరవం ఎంతో గొప్పవి. ఇది నా బాధ్యతను మరింతగా పెంచుతుంది. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలతోనే ఈ విజయం సాధ్యమైంది - సీఎం జగన్‌ 



Sunday, May 02, 2021

Accident insurance of Rs 10 lakh for expatriate Andhras

 


విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయులకు తక్కువ ప్రీమియంతో ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్టీ) ప్రమాద, వైద్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. విదేశాల్లో పనిచేస్తున్న, చదువుకుంటున్న తెలుగువారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్పిందిగా ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షుడు వెంకట్‌ ఎస్‌ మేడపాటి బుధవారం తెలిపారు. ఉద్యోగస్తులు మూడేళ్ల కాలానికి రూ.550 ప్రీమియం చెల్లిస్తే రూ.10 లక్షల ప్రమాద బీమా రక్షణతో పాటు, చికిత్స కోసం లక్ష రూపాయలు అందిస్తామన్నారు.

అలాగే మరణించిన వారి మృతదేహాలను తీసుకురావడానికి విమాన ఖర్చులు, మహిళకు ప్రసూతి ఖర్చుల కింద గరిష్టంగా రూ.50,000 వరకు బీమా రక్షణతో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు రూ.10 లక్షల ప్రమాద బీమా రక్షణ కోసం ఏడాదికి రూ.180 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న వారికి ఆయా దేశాల దాతల సహకారంతో బీమా ప్రీమియంలు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీఎన్‌ఆర్టీ వెబ్‌సైట్‌ ద్వారా పాలసీ తీసుకోవచ్చన్నారు.


For More details Click Here

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top