ఇదెక్కడి సంస్కృతి?
ఇదెక్కడి ఆర్భాటం?
ఇదెక్కడి భజనా బృందం?
కులంప్రాతిపదికన పదవులా?
సాక్షత్తు ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడటం మొదలు పెడితే, ప్రతిపక్షం వాళ్ళు చిడతలు వాయించటం చూసి, ఏకంగా ఆ ఎమ్మెల్యే పెళ్ళిఉబికివస్తున్న నవ్వుని పంటికింద బిగబట్టుకొని మరీ చదువుతూ పోయింది తన కంటెంట్ ని, దీన్ని బట్టి నాయకుడి భజనా కార్యక్రమం ఏ రేంజిలో ఉందో దేవుడా..ఈ కులం ప్రాతిపదికన పదవులు కట్టబెట్టి సంకలు గుద్దుకోవడం ఏంటి, ప్రజలకు సేవ చేసే లక్ష్యం, వ్యక్తిగత ప్రతిభ, అనుభవం, విలువలు, సమర్ధత, టాలెంట్ లను బట్టి కదా పదవులు కట్టబెట్టాల్సింది? కులాల ప్రాతిపదికన కాకుండా టాలెంట్ చూసి ఫలానావాడు మీకు ఫలానా అభివృద్ధి చేసి పెడతాడు, ఫలానావాడు ఈ శాఖా నైపుణ్యం లో నిష్ణాతుడు అని చెప్పి పదవులిచ్చే దమ్ము ధైర్యం లేదా??
లంచం..లంచం...!
ఈ మధ్య కాలం అక్టోబర్ మాసం 2021 సంవత్సరంలో అనుకుంటా నాకు తెలిసిన ప్రకాశం జిల్లాలో ఎన్నారై మిత్రుడు ఒకరు ఎకరం పొలం కొనుగోలు చేస్తే, సర్వే చేయడానికి ఏకంగా 15000 సమర్పించుకున్నాడు. పొలం పాస్ బుక్ ఆన్‌లైన్ చేసినందుకు అదనంగా ఇంకో 6000 ఇచ్చుకున్నాడు. భూములకు సంబందించిన ఏ విషయoలో అయినా సరే ప్రభుత్వంతో కూడుకున్న యవ్వారం లంచం సమర్పించుకోవడం తప్పటం లేదు, యాంటీకరప్షన్ కి ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఉండదు, ఒక్కడు పట్టించుకునే దిక్కు లేదు. ఒక ఎన్ఆర్ఐ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య రైతు గతి ఏంటి? ఎమ్మార్ఓ ఆఫీసులు దగ్గర రైతన్నల పరిస్థితి చూస్తే కళ్ళ ముందు ఠాగూర్, శంకర్ సినిమా కనపడింది. ముఖ్యమంత్రి స్థాయి నుంచి అటెండర్లు వరకు ప్రతినెలా అందరూ జీతాలు తీసుకుంటున్నారుగా, పని చేయటానికి ఎం రోగం దేవుడా?
ఈ బూతుల పురాణం ఏంటి?
నువ్వు ఒకటి అంటే..నేను రెండు అంటాను...నువ్వు రెండు అంటే..నేను నాలుగు అంటాను...నువ్వు నాలుగు అంటే..నేను పదహారు అంటాను...! అమ్మ వారి జాతర లో బలిచ్చే మేకను రెడీ చేసినట్టుగా చేతికి తాయత్తులు, మెడలో రుద్రాక్షలు, జీన్స్ ప్యాంట్లు ఏసుకొని .. నోటికి మాత్రం పచ్చి బూతులు బాబోయ్ బూతులు ఇంత దిగజారిపోయి ఫోర్త్ గ్రేడ్ లాంగ్వేజ్ చట్ట సభల్లో ప్రదర్శించడం చండాలం! అవతలివాడు యదవే, కానీ ఇలాంటి బజారు మాటలు, పదజాలంతో మాట్లాడి మీ స్థాయిని ఎందుకు దిగజార్చుకుంటారు? ఒకావిడ ఇలా సెలవిచ్చారు..ఎమ్మెల్యే గా ఉంటే టీవీ షోలు గట్రా ఎంచక్కా చేసుకోవచ్చు అంట, మంత్రి పదివి ఉన్నప్పుడు మాత్రం కాస్తంత హుందాగా వ్యవహరించాలంట..అంటే ఎమ్మెల్యే అనేది పదవి కాదా? ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు గౌరవంగా నడుచుకోవాల్సిన బాద్యత ఏమీ అక్కర్లేదా? మంత్రి పదువులు ఉంటేనే హుందాగా నడుచుకోవాలా? ఇదెక్కడి దిక్కుమాలిన లాజిక్కు? తగ్గేదేలే..ఎవరుపడితే వాడు ఓడిస్తాను..ఓడిస్తాను...అంటే ఉరుకోవడానికి ఇది మీ అడ్డా కాదు బిడ్డా..ఇది ఆంధ్ర ప్రదేశ్ గడ్డా..ఇది జగన్ అన్న అడ్డా అని పేపర్ మీద రాసుకొని వచ్చిన డైలాగుని డాల్బీ డిజిటల్లో గట్టిగా చదివి అరిస్తే మాయాబజార్ సినిమాలో ఆహా ఓహో హైహై నాయకా హొయ్ హొయ్ నాయకా అన్నట్టుంది..ఆంధ్ర ప్రదేశ్ అడ్డా ఎవడి సొంతం కాదు బిడ్డా..ఇది ప్రజలందరి అడ్డా ఈ మాత్రం సెన్స్ ఉండదా? ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు..ప్రజలు మాత్రమే శాశ్వతం ఇక్కడ. ఇంకొక యూవకిశోరం ఇలా సెలవిస్తారు..ఇప్పటిదాకా మంత్రి పదవి అడ్డుంది ఇప్పుడు అది పోయింది, ఇక నుంచి చూడండి నా ప్రతాపం ఏ రకంగా ఉంటుందో..అవతలివాడు రెండు తిడితే మేము ఇరవై తిట్టడానికి రెడీ అని. ఇక సోషల్ మీడియా జాతిరత్నాలు అయితే బరితెగింపుకి పరాకాష్ట..ఎంత గట్టిగా డాల్బీ డిజిటల్ ప్లస్ నోరేసుకొని ఎన్ని ఎక్కువ బూతులు తిడితే.. అంత గొప్ప పదవులు ఇదేం అరాచకం? రాబోయే తరాలవారికి ఏమి నేర్పిస్తున్నట్టు? ఏ రకమైన రాజకీయాలు బోధిస్తునట్టు ఎర్రి సుబ్బన్నా?
ఎవిరీథింగ్ కంపారిసిన్?
విద్యుత్, మెడిసిన్, ఆర్ధికం, విద్య, పన్నులు, రెజిస్ట్రేషన్స్, టూరిజం etc ప్రతి రంగానికి సంభందించిన విష్యంలో కంపారిసిన్, వాళ్ళ హయంలో ఆలా చేసారు, మేము ఇలా చేస్తున్నాం, జయము జయము ---- బొమ్మేసారు, అవకాశం వచ్చినప్పుడు వీళ్ళ బొమ్మ వాల్లేస్తారు. వీళ్ళు యెల్లో మీడియా, దత్తపుత్రుడు, వాళ్ళు వైస్సార్ మీడియా అని గగ్గోలు, రోజువారీ ఇదే రచ్చబండ కార్యక్రమం...ఇంతకు మించి ఏముంది గర్వకారణం?
టామ్ అండ్ జెర్రీ గేమ్?
యెల్లోపార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీమాన్ జ. అన్న అసెంబ్లీ సమావేశాలు ఒదిలేసి ప్రజాక్షేత్రం లో పోరాడతాము, బస్తి మే సవాల్ మీతో మాకు పనేంటి? సీన్ కట్ చేస్తే మళ్ళీ అదే సీన్ రిపీట్ జ.అన్న అధికారంలో శ్రీమాన్ చ.అన్న అసెంబ్లీ సమావేశాలు గుడ్బై ..ఇంకో బస్తి మే సవాల్, ప్రజల సమస్యలు, కష్టాలు, అభివృద్ధి అన్నీ గాలికి ఒదిలేసి.. టామ్ అండ్ జెర్రీ గేమ్ ఆడుకుంటున్నారా? ఇది చాలదు అన్నట్టుగా ఈ గేమ్ లో ఇంకో ప్లేయర్ ఉన్నాడయ్యో.. పంటి కింద ఇరక్కపోయి బయటికి రాలేక ఎప్పుడు ఉడుకుమూత్రం తో రగిలిపోయే ఒక గొప్ప సోషల్ మీడియా బండ ఉద్యమకారుడు జ.రెడ్డి, జ. రెడ్డి జ.రెడ్డి.. ఈ బలవంతపు మంత్ర జపం వెంక ఉన్న లాజిక్ ఏంటో ఆ దేవుడికే తెలియాలి?
అన్నీ కాపీ పేస్ట్ లే నాయనా!
ఒకసారి గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్లి దేకండి..ప్రజలు ఏమనుకుంటున్నారో కక్కలేక మింగలేక ఉన్న పరిస్థితులు. పదిహేను సంవత్సరాల క్రితం వైస్సార్ గారు ఎప్పుడో అమలుపరిచిన పెన్షన్,ఫీజు రీయింబర్సుమెంటు,జల యజ్ఞం,ఇందిరమ్మ ఇళ్లు,పావలా వడ్డీ,2 రూపాయల బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ.. సంక్షేమ పధకాలు. ఇప్పుడు అమలుచేస్తున్న పధకాల విష్యంలో జబ్బలు సరుసుకోవడం ఆపండి. ఒకటి అరా తప్ప కొత్తగా చేసింది ఏమి లేదు.
డై హార్డ్ ఫాన్స్ అయినా సరే..డోంట్ కేర్!
శుభకార్యానికో ఇంకేదో ఫంక్షన్ కో ఎంపీని కానీ, లోకల్ ఎమ్మెల్యే కానీ అభిమానం, ప్రేమతో పిలిస్తే దేకను కూడా దేకరు. దీంట్లో కూడా మన మతం వాడా కాదా, వాళ్ళ కులం వాళ్ళా కాదా, మన ప్రాంతం వాడా కాదా, డబ్బు ఉన్నవాడా, లేనోడా ఇన్ని బేరీజు వేసుకున్నాక ఇష్టం ఉంటే వస్తారు లేదంటే బోల్డన్ని సాకులు వెతుకుంట్టారు. సి. అన్నా, జ. అన్నా, ప. అన్నా అన్నీఆ టాను ముక్కలే, చొక్కాలు చించేసుకొనే డీజే టిల్లులు ఉన్నంతవరకు ఈ ఖర్మలన్ని చూస్తూ భరించడం తప్ప డై హార్డ్ ఫాన్స్ చేసేది ఏమీ లేదు.
అభివృద్ధి, దొందూ దొందే?
ఆంధ్ర ప్రదేశ్ కాపిటల్ సిటీ ఏది?
ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎక్కడ?
చెడువ్యసనాలు మానాలి అనుకునేవారికి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏవి?
ఆంధ్ర ప్రదేశ్ లంచాలు లేని రాష్ట్రంగా చేస్తాము అన్నారుగా?
200 యూనిట్ల విద్యుత్తూ ఫ్రీగా ఇస్తాము అన్నారుగా ఎక్కడా?
పాత యెల్లో గ్యాంగ్ బాదుడే బాదుడు అని మొత్తుకున్నారుగా..ఇప్పుడు మీరు సాధించింది ఏముంది?
జసిందా అర్డర్న్- మీలాంటి డైనమిక్ లీడర్ మాకెందుకు లేరు?
అంకితభావం, నిరాడంబరత, ధైర్యం, కృషి,పట్టుదల, సమగ్రత, ప్రజల పట్ల కరుణా, శాంతి హృదయం, దేశాన్ని అందులో భాగస్వామ్యులు అయిన ప్రజలను ప్రగతి వైపు పరుగులు తీయించే..మీలాంటి ధీర నాయకురాలు మా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు పుట్టలేదా అని అప్పుడప్పుడు బాధ కలుగుతుంటుంది.
ఏంటో మాకు ఈ ఖర్మ!
No comments:
Post a Comment