fvz

Monday, February 05, 2024

ANDHRA PRADESH YSR Congress Party DEVELOPMENTS between 2019 to 2024


విద్యా రంగం.. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు. పేద పిల్లలకు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తున్నాం. మనబడి నాడు-నేడు ద్వారా స్కూల్స్‌ రూపురేఖలు మార్చాం. విద్యారంగంపై రూ.73,417 కోట్లు ఖర్చు చేశాం. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని అ‍మ్మఒడి పథకం తెచ్చాం. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలే లక్ష్యంగా నాడు-నేడు కార్యక్రమం. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా రూ.15వేలు జమ చేస్తున్నాం. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు గోరుముద్దకు రూ.4,417కోట్లు ఖర్చు చేశాం. జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ.1,910 కోట్లు ఖర్చు చేస్తున్నాం. జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటి వరకు రూ.3,367 కోట్లు ఖర్చు చేశాం. విద్యా సంస్కరణల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ కీలకమైనది. 8,9 తరగతుల విద్యార్థులకు 9,52,925 ట్యాబ్స్‌ పంపిణీ చేశాం. వచ్చే ఏడాది జూన్‌ నుంచి ఒకటో తరగతి నుంచి ఐబీ విధానం. ప్రతీ ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తాం. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా విద్యాబోధన. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు. అత్యున్నత 50 విద్యా స్థంస్థల్లో గుర్తించిన 20 ఫ్యాకల్టీలలో ఏ విభాగంలోనైనా విదేశీ విద్యను అభ్యసించవచ్చు. ఇప్పటివరకు రూ.1.25 కోట్ల వరకు మొత్తం రీయింబర్స్‌ చేస్తున్నాం. ప్రభుత్వ కృషితో స్కూల్స్‌లో డ్రాప్‌ఔట్‌లు గణనీయంగా తగ్గాయి. వైద్య రంగం.. రాష్ట్రవ్యాప్తంగా 10,132 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు. 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు. 53 ఏరియా ఆసుపత్రులు, తొమ్మిది జిల్లా ఆసుపత్రుల్లో వసతులు అభివృద్ది. నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు. ఇప్పటి వరకు 53,126 మంది వైద్యసిబ్బందిని నియమించాం. ఫ్యామిలీ డాక్టర్‌ కింద 3.03 కోట్ల ఓపీ సేవలు అందించాం. ఇప్పటి వరకు 1.3 కోట్ల గ్రామీణ రోగులకు ఇంటి వద్దే వైద్య సేవలు. ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృతం చేశాం.
ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారామెడికల్‌ సిబ్బందిని నియమించాం. ఇప్పటి వరకు 1.32 కోట్ల ప్రత్యేక రోగుల సేవలు అందించాం. ఆరోగ్య ఆంధ్ర​ప్రదేశ్‌ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. వ్యవసాయ రంగం.. రైతులు రాష్ట్రానికి వెన్నముక 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఇప్పటి వరకు 53.53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చాం. రైతు భరోసా కింద రూ.33,300 కోట్లు పంపిణీ. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం. ఉచిత పంట బీమా కింద 54.75 లక్షల మంది రైతులకు రూ.7802కోట్ల క్లైయిమ్‌లు. మిచాంగ్‌ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు రూ.347.55 కోట్లు విడుదల.
జీఎస్‌డీపీలో వ్యవసాయం వాటా ఏపీలో 36 శాతం కాగా, జాతీయ సగటు 18శాతమే. ఆక్వా రంగం.. రూ.50.30 కోట్లతో 35 ఆక్వాల్యాబ్‌ల ఏర్పాటు. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ సరఫరా. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రతీ కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌. దేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో 30 శాతం వాటాతో ఏపీ మొదటి స్థానం. వేటకు వెళ్లి మత్స్యకారులు చనిపోతే రూ.10లక్షల పరిహారం. 20వేల ఫిషింగ్‌ బోట్లకు డీజిల్‌ సబ్సిడీ కింద రూ.128 కోట్లు. 61వేల మంది ఆక్వా రైతులకు విద్యుత్‌ ఛార్జీ రాయితీ రూ.3186కోట్లు. 2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా కల్చర్‌. రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం వాటాతో ఆక్వా హబ్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ. మహిళా సాధికారత.. మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ. వైఎస్సార్‌ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం. 78.84 లక్షల మంది మహిళలకు రూ.25,571 కోట్లు. రాష్ట్రంలో 55,607 మెయిన్‌, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా 6.4 లక్షల మంది గర్భిణిలు, 28.62 లక్షల మంది పిల్లలకు లబ్ధి. పౌష్టికాహార పథకాలకు రూ.6688 కోట్లు ఖర్చు. అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.21.82 కోట్ల విలువైన గ్రోత్‌ మానిటరింగ్‌ పరికరాలు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 66.34 లక్ష మందికి పెన్షన్‌ అందిస్తున్నాం. రాష్ట్రంలో దిశయాప్‌ ద్వారా 3040 కేసులు. పెన్షన్‌ కానుక.. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల పెన్షన్‌ అందిస్తున్నాం. నెలవారీ పెన్షన్‌ బడ్జెట్‌ రూ.1961 కోట్లు పెరిగింది. వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం కోసం రూ.4,969.05 కోట్లు కేటాయింపు. వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ.14,129 కోట్ల పంపిణీ. వైఎస్సార్‌ కాపునేస్తం కింద రూ.2,029 కోట్లు జమ. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద రూ.1,257.04కోట్లు జమ. ఐదేళ్లలో రూ.75వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నాం. 3,57,844 మంది అర్హుల ఖాతాల్లో రూ.2,029 కోట్లు జమ. రూ.71కోట్ల వ్యయంతో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల కొనుగోలు. దీని ద్వారా 3,27,289 మంది తల్లులకు లబ్ది. ఆటో ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ మొబైల్‌ డిస్పెన్సింగ్‌ ఓనర్లకు 10వేలు ఆర్థిక సాయం. జగనన్న చేదోడు ద్వారా దుకాణాలు, నాయిబ్రహ్మణులు, దర్జీలకు ప్రభుత్వం 10వేలు అందిస్తోంది. జగనన్న తోడు ద్వారా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు రూ. 10 వేల వడ్డీలేని రుణం అందిస్తున్నాం. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా రూ. 350.89 కోట్లు అందిస్తున్నాం. నాన్‌ డీబీటీ కింద 4.23 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు అందించాం. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం..
పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత. పీడీఎఫ్‌ కుటుంబాలకు సానుభూతితో పునరావాసం కల్పించాం. పోలవరం ప్రాజెక్ట్‌లో ఇప్పటి వరకు 74.01 శాతం పనులు పూర్తి. ఎల్‌ఏ అండ్‌ ఆర్‌ఆర్‌ పనిలో 22.42 శాతం పూర్తి. రూ.280 కోట్లతో 10 టీఎంసీల చిత్రావతి ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాం. అవుకు ప్రాజెక్ట్‌ రెండో టన్నెల్‌ను పూర్తి చేశాం. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు పూర్తి చేశాం. పులిచింతల నిర్వాసితులకు రూ.142 కోట్లు చెల్లించాం. 24 గంటల త్రీఫేజ్‌ కరెంట్‌ విద్యుత్‌ నష్టాలను తగ్గించేందుకు వ్యవసాయ ఫీడర్లు. గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల త్రీఫేజ్‌ కరెంట్‌ ఇస్తున్నాం. ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు పగటి పూట కరెంట్‌. తొమ్మిది గంటల ఉచిత్‌ విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. 1221 కి.మీల రోడ్ల మరమ్మతులకు రూ.490కోట్లతో పనులు. ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన 880 బస్సులు. జగనన్న టౌన్‌షిప్‌ల కోసం ప్రతీ నియోజకవర్గంలో రెండు ఎంఐజీ లేఅవుట్లు. 12,042 ప్లాట్లతో 30 ప్రాజెక్ట్‌లు చేపట్టాం. ఐటీ, విమానయాన, పర్యాటక​ రంగం.. భోగాపురంలో మే మూడో తేదీన నిర్మాణ పనులు ప్రారంభించాం. మరో 30 నెలల్లో ఎయిర్‌పోర్టు ప్రారంభించేందుకు సిద్ధం. ఐటీ రంగాన్ని ప్రొత్సహించేందుకు ఐటీ పాలసీ 2021-24 ప్రవేశపెట్టాం. ఐటీ ఫలాలు చివరి మైలురాయి వరకు చేరేలా కృషి. 200 ఎండబ్ల్యూ డేటా సెంటర్‌ కోసం రూ.14,694కోట్ల పెట్టుబడి. మధురవాడలో ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు. పర్యాటక రంగం అభివృద్ధికి ఏపీ టూరిజం పాలసీ 2020-2025 అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంపై ఫోకస్‌. 7,290 మందికి ఉపాధి కల్పించేలా రూ.3,685 కోట్ల పెట్టుబడి. వికేంద్రీకరణ.. వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 13 కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైంది. 2.6 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలు. జగనన్న సురక్ష ద్వారా కోటి ధృవీకరణ పత్రాలను ఇంటి వద్దకే అందించాం. 35,44,866 ఎకరాల భూమి పేదలకు పంపిణీ, హక్కులు కల్పించాం. 20,24,709 మంది భూమి లేని నిరు పేదలకు ప్రయోజనం. మా ప్రభుత్వంలో పేదరికం 11.52 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గింది.




 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top